శభాష్ NPDCL ఉద్యోగులు... అర్ధరాత్రి.. జడివానలో కరెంట్ అధికారుల మెరుపు వేగం (వీడియో)

by Bhoopathi Nagaiah |

భారీ వర్షాల్లో కూడా తమ ప్రాణాన్ని పణంగా పెట్టి పనిచేసే వారు ఎవరైనా ఉన్నారంటే అది విద్యుత్ శాఖ సిబ్బందే. వారికి ఎండ.. వాన.. అనే తేడాలేకుండా విధుల్లో మునిగిపోతారు.

శభాష్ NPDCL ఉద్యోగులు... అర్ధరాత్రి.. జడివానలో కరెంట్ అధికారుల మెరుపు వేగం (వీడియో)
X

దిశ, ఖమ్మం : భారీ వర్షాల్లో కూడా తమ ప్రాణాన్ని పణంగా పెట్టి పనిచేసే వారు ఎవరైనా ఉన్నారంటే అది విద్యుత్ శాఖ సిబ్బందే. వారికి ఎండ.. వాన.. అనే తేడాలేకుండా విధుల్లో మునిగిపోతారు. ఎక్కడ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా నిరంతరం శ్రమిస్తుంటారు. అయితే బుధవారం రాత్రి ఖమ్మం డివిజన్ పరిధిలోని అధికారులకు ఓవైపు వరుణ దేవుడు.. మరోవైపు ఓ కారు డ్రైవర్ అగ్నిపరీక్ష పెట్టారు. అయినా అలుపెరగకుండా అర్ధరాత్రి మెరుపు వేగంతో విద్యుత్‌ను పునరుద్ధరించి ఔరా అనిపించారు.

ఖమ్మం అర్బన్ సెక్షన్‌ టేకులపల్లిలోని డబుల్ బెడ్ రూం ప్రాంతంలో బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఓ వ్యక్తి ఇన్నోవా కారును నడుపుతూ అదుపు తప్పి ఎదురుగా ఉన్న స్తంభాన్ని ఢీకొట్టాడు. దీంతో రెండు స్తంభాలు విరిగిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వెంటనే స్థానికులు అర్బన్ ఏఈకి సమాచారం ఇవ్వడంతో వెంటనే సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఒకపక్క వర్షం... మరోపక్క టేకులపల్లిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయినా జడివానను సైతం లెక్కచేయకుండా కారుచీకట్లో సిబ్బందితో కలిసి విరిగిపోయిన స్తంభాలను, వైర్లు మార్చి రెండు గంటల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. సెక్షన్‌లో ఉన్న సిబ్బంది అందరూ రెండు గంటలు కష్టపడి విద్యుత్ సరఫరాను అందజేయడంతో స్థానికులు ఎన్పీడీసీఎల్ ఉద్యోగులను అభినందించారు. విధుల్లో ఏఈ నాగేశ్వరరావు, లైన్మెన్ దువ్వా రాంబాబు, లైన్ ఇన్‌స్పెక్టర్ ఆనందరావు, అసిస్టెంట్ లైన్‌మెన్ మాధవరావు, మోహన్, సిబ్బంది రవి, ఈఆర్టీ టీం తదితరులు ఉన్నారు.

వీడియో:

Next Story