మధిరలో గులాబీ జెండా ఎగరేస్తాం..లింగాల కమల్ రాజు

by Disha Web Desk 20 |
మధిరలో గులాబీ జెండా ఎగరేస్తాం..లింగాల కమల్ రాజు
X

దిశ, మధిర : రానున్న అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ మధిర అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని మధిర గడ్డపై గులాబీ జెండాని ఎగరవేస్తామని జెడ్పీ చైర్ పర్సన్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్ రాజ్ అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందుగా బీఆర్ఎస్ పార్టీ మధిర ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు నామ నాగేశ్వరరావు, వద్ది రాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తాత మధు, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మధిర నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. కార్యకర్తలు కష్టపడి పనిచేయడం వల్లే బీఆర్ఎస్ పార్టీ అన్ని ఎన్నికల్లో ఘనవిజయం సాధించాం, రానున్న అసెంబ్లీ ఎన్నికలలో కూడా ప్రజల సహకారంతో, నాయకులు, కార్యకర్తల కృషితో మధిర గడ్డపై గులాబీ జెండా ఎగురుతుందన్నారు.

మధిరతో పాటు మరో వంద స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఘనవిజయం సాధిస్తారని, ముఖ్యమంత్రి కేసీఆర్ యాట్రిక్ సాధించి, మరల ముఖ్యమంత్రి పదవిని చేపటేది కేసీఆర్ అన్నారు. ముఖ్యమంత్రిని విమర్శించే అర్హత భట్టి విక్రమార్కకి లేదు అన్నారు. మధిర నియోజకవర్గ అభివృద్ధికి భట్టి విక్రమార్క చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ గా తనకు అవకాశం ఇచ్చారు కాబట్టే మధిరలో వంద పడకల ఆసుపత్రి, ట్యాంక్ బండ నిర్మాణం, సమీకృత మార్కెట్ ఏర్పాటు చేశామన్నారు. మధిర నియోజకవర్గ ప్రజలు ఆలోచించి ఒకసారి తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కోరారు.

నేను గెలిస్తే నియోజకవర్గ ప్రజలకు లాభం చేకూరుతుందని, భట్టి విక్రమార్క ను గెలిపిస్తే భట్టి కుటుంబానికి లాభమని, నియోజకవర్గ అభివృద్ధి ఇంకా కుంటుపడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలు అందరికి అందలన్నా, మధిర నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ది ఎమ్మెల్యేగా మధిర నుండి అసెంబ్లీలో అడుగు పెట్టాలన్నారు. మధిర అసెంబ్లీ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని రానున్న కాలంలో మధిర నియోజకవర్గం మరింత అభివృద్ధి పథంలో ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ మొండెం లలిత మున్సిపల్ చైర్ పర్సన్ లత, బీఆర్ఎస్ నాయకులు రంగశెట్టి కోటేశ్వరావు, సితార నాగేశ్వరావు, గుర్రం రామారావు, కనుమ వెంకటేశ్వరరావు, జెవిరెడ్డి తదితరులు ఉన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed