- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం : పువ్వాడ
అంబేద్కర్ అనేక సంస్కరణలకు ఆద్యుడని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు.

దిశ బ్యూరో, ఖమ్మం: అంబేద్కర్ అనేక సంస్కరణలకు ఆద్యుడని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. బుధవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఖమ్మం గట్టయ్య సెంటర్ జిల్లా పార్టీ కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి వారు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. అంబేద్కర్ బడుగు, బలహీనవర్గాలు, దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడని పేర్కొన్నారు. ఆయనలోని నాయకత్వ లక్షణాలను కేసీఆర్ ఆదర్శంగా తీసుకుని పాలన చేశారని, వారి స్ఫూర్తితోనే పేద, సామాన్యులకు సంక్షేమం, అభివృద్ధి చేరువ చేశారని అన్నారు. కేసీఆర్ సారధ్యంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి(55) మృతి పట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు తాతా మధు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పలువురు ఘనంగా నివాళులు అర్పించారు. వారి మృతి పార్టీకి తీరని లోటని, సంపత్ రెడ్డి కుటుంబ సభ్యులకు తమ ప్రగడ సానుభూతిని తెలియజేశారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తామని, ఎన్నికలలో గెలుపు ఓటములు సాధారణమే అన్నారు. విజయాలు వచ్చినప్పుడు పొంగిపోవడం.. అపజయం వచ్చినప్పుడు కృంగిపోవడం పార్టీ నైజం కాదన్నారు.






