మణుగూర్ ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా..

by Elthuri vijay kumar |

మణుగూరు మున్సిపాలిటీని ఆదర్శవంతమైన, సమస్యలు లేని మున్సిపాలిటీగా ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యమని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు.

మణుగూర్ ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా..
X

మణుగూర్ ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా..

- అధికారులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించాలి

-పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

దిశ, మణుగూరు: మణుగూరు మున్సిపాలిటీని ఆదర్శవంతమైన, సమస్యలు లేని మున్సిపాలిటీగా ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యమని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం ఆయన మణుగూరు మున్సిపాలిటీలోని నాయుడు కుంట వద్ద సుమారు రూ. 5 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వర్షాలు తగ్గగానే మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతాయన్నారు. సీసీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్, బండ్ చుట్టూ డ్రైనేజీలను ఏర్పాటు పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అధికారులు ఎప్పటికప్పుడు దగ్గరుండి పనులను పర్యవేక్షించాలని, త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. ప్రజలు సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మణుగూరు మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పీరినాకి నవీన్, పట్టణ అధ్యక్షులు శివ సైదులు, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు రహీంపాష, మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు సౌజన్య, యువజన విభాగం మండల అధ్యక్షులు తరుణ్ రెడ్డి, చింతల కృష్ణ, రవీందర్, లక్ష్మణ్, అప్పారావు, నాగేశ్వరరావు, రాములు, సూరయ్య, మహేష్, మానస, ఆదిలక్ష్మి, కృష్ణవేణి, అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story