సర్పంచ్ చొరవతో తీరిన నీటి కష్టాలు...

by Kodari Anjali |

పంచాయతీ అభివృద్ధే లక్ష్యమని సర్పంచ్ కిరణ్ అన్నారు.

సర్పంచ్ చొరవతో తీరిన నీటి కష్టాలు...
X

దిశ, కారేపల్లి: మండల పరిధిలోని గంగారం తండాలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న తాగునీటి సమస్యకు గ్రామ సర్పంచ్ నునావత్ కిరణ్ పరిష్కారం చూపించారు. మిషన్ భగీరథ నీటి సరఫరా అందని సుమారు పది కుటుంబాలకు రూ.50 వేల వ్యయంతో రహదారి కింద అండర్‌గ్రౌండ్ పైపులైన్ ఏర్పాటు చేసి నీటి సరఫరా అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ కిరణ్ మాట్లాడుతూ.. పంచాయతీ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. రహదారులపై వరద నీరు నిల్వ ఉండకుండా ఇరువైపులా సుమారు 500 మీటర్ల మేర సైడ్ కాలువలు తవ్విస్తున్నామని చెప్పారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఎన్నాళ్లుగానో శుభ్రం చేయని మంచినీటి ట్యాంకును పరిశుభ్రం చేసినట్లు వెల్లడించారు.

Next Story