భద్రాచలం వద్ద ప్రమాద హెచ్చరికలు ఉపసంహారణ

by velandi.Saikiran |

భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ప్రమాద హెచ్చరికలు ఉపసంహారించారు అధికారులు. ఆదివారం ఉదయం

భద్రాచలం వద్ద ప్రమాద హెచ్చరికలు ఉపసంహారణ
X

దిశ, భద్రాచలం: భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ప్రమాద హెచ్చరికలు ఉపసంహారించారు అధికారులు. ఆదివారం ఉదయం 8.54 గంటలకు 48 అడుగులకు గోదావరి వరద చేరుకోవడంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మధ్యాహ్నం 1.05 గంటలకు 47.90 అడుగులకు తగ్గింది. దీంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక ఉపసంహారించినట్లు ప్రకటించారు. మధ్యాహ్నం 1.05 గంటల నుండి రాత్రి 8 గంటల వరకూ, దాదాపు 7 గంటలు గోదావరి నిలకడగా ప్రవహించిన అనంతరం రాత్రి 9 గంటలకు స్వల్పంగా తగ్గి 47.80 అడుగులకు చేరింది. సోమవారం ఉదయం నుండి క్రమంగా తగ్గుతూ, రాత్రి 7.37 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి 43 అడుగులకు తగ్గి ప్రవహిస్తుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక సైతం ఉపసంహారించారు.

Next Story