- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దీటైన అభ్యర్థి ఎవరు..?
మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేయనున్న అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రధాన పార్టీలు వేగవంతం చేశాయి.

దిశ, ఖమ్మం రూరల్ : మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేయనున్న అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రధాన పార్టీలు వేగవంతం చేశాయి. నేడో.. రెపో.. ఎన్నికల షెడ్యుల్ విడుదలయ్యే అవకాశాలు ఉండటంతో ఆయా పార్టీలు ఈ ప్రక్రి యపై దృష్టి సారించాయి. ఒక్క కౌన్సిలర్ స్థానానికి టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేకంగా కసరత్తు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఆశావాహుల నుంచి పేర్లు స్వీకరించిన ప్రధాన పార్టీలు.. వడపోతలు షురూ చేశాయి. టిక్కెట్ల కోసం ఆశావహులు తరలిరావడంతో ప్రధాన పార్టీల కార్యాలయాలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిల నివాసాల వద్ద ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది.
ఆశావాహుల పేరిట బీఆర్ఎస్ సర్వే..
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఓ అడుగు ముందుకేసింది. ఆయా బలమైన అభ్యర్థుల కోసం ఆయా మున్సిపాలిటీల్లో అన్ని కౌన్సిలర్ స్థానాలకు బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు సీపీఐ, సీపీఎం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే టిక్కెట్ల ఖరారు కోసం మున్సిపాలిటీలో కోర్ కమిటీలను నియమించింది.
కాంగ్రెస్ టిక్కెట్ల ఖరారు కోసం కమిటీలు
కాంగ్రెస్ పార్టీ వార్డుల్లో సర్వే నిర్వహిస్తోంది. టిక్కెట్లు ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తులు, వారి పేర్లను స్వీకరించిన ఆ పార్టీ.. ఆశావహుల పేర్లతో ఆయా వార్డుల్లో సర్వే చేస్తోం ది. పనిలో పనిగా ఏ పార్టీకి గెలుపునకు అవకాశాలు ఉన్నాయనే అంశపైనా ఈ సర్వే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఎక్కడైన పార్టీ వీక్ గా ఉన్న వార్డులను ఇప్పటి నుంచే గుర్తించి వాటిపై మరింత ఫోకస్ చేయాలని భావిస్తోంది. ఎన్నికల ఇన్చార్జిలు అన్ని మున్సిపాలిటీల్లో ఆశావహులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఇప్పుడు కౌన్సిలర్ టిక్కెట్ల కోసం అధికార పార్టీ కాంగ్రెస్లో పోటాపోటీ నెలకొంది. టికెట్టు ఆశించి భంగపడిన వారు రెబె ల్స్ గా బరిలోకి దిగకుండా బుజ్జగింపులు చేస్తోంది. సీపీఐ పార్టీ సైతం తమకు బలం ఉన్న చోట సత్తా చాటేందుకు కసరత్తులు చేస్తున్నారు. మున్సిపాలిటీల వారీగా పార్టీ ఇన్చార్జీ లను కూడా నియమించే అవకాశాలు ఉన్నాయని సీపీఐ పార్టీ నాయకులు పేర్కొం టున్నారు. ఎలాగైనా ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బలమైన అభ్య ర్థులను బరిలోకి దించేందుకు ఆ పార్టీ కసరత్తు చేస్తోంది. టిక్కెట్లు ఖరారు చేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ వార్టుకో.. ప్రత్యేకంగా కమిటీలు వేసింది. మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంచార్జీ తుంబూరు దయాకర్‌రెడ్డి మున్సిపాలిటీలోని వార్డులకు ఇన్చార్జీలను నియమించారు.పార్టీ అభ్యర్థిత్వాల కోసం వచ్చిన పేర్లను ఈ కమిటీ పరిశీలించి టిక్కెట్లను ఖరారు చేయనుంది. ఒకవేళ ఈ కమి టీలో ఏకాభిప్రాయం కుదరని పక్షంలో ఆయా వార్డుల్లో సర్వే నిర్వహించి టిక్కెట్లు కేటాయిం చాలని అధికార పార్టీ నిర్ణయించింది. ఇప్పటికే పలు మున్సిపాలిటీలకు సంబంధించి ఆశావ హుల జాబితాలను సిద్ధమయ్యాయి. ఈ జాబి తాలను కమిటీ పరిశీలించనుంది. అధికార పార్టీ కావడంతో ఈ టిక్కెట్ల కోసం పోటీ ఎక్కు వగా ఉంది. సర్పంచ్ ఎన్నికల ఫలితాలను దృ ష్టిలో ఉంచుకుని ఈ ఎన్నికల్లో పార్టీ రెబెల్స్ బరిలో ఉండకుండా కాంగ్రెస్ పార్టీ ముందు జాగ్రత్త వహిస్తోంది.






