- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెన్షన్ కోసం ఎదురుచూపులు.. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు
పెన్షన్ కోసం ఎదురుచూపులు ఓ మహిళ ఆవేదన అంతా ఇంతా కాదు.

దిశ, ఆళ్లపల్లి : పెన్షన్ కోసం ఎదురుచూపులు ఓ మహిళ ఆవేదన అంతా ఇంతా కాదు. మండల పరిధిలోని మర్కోడు గ్రామ పంచాయతీ షేక్ అజీమా వ్యవసాయ కూలీగా పని చేసుకుంటూ కుటుంబ సభ్యులతో జీవనం గడుపుతూ ఉండేది. ఒక్కసారిగా తనకు తన కుడి కాలికి ఇన్ఫెక్షన్ రావడం తో పూర్తిగా తీసేశారు. ఆ సమయంలో రూ.4 లక్షల వరకు ఖర్చు అయిందని, దీంతో నడవలేని పరిస్థితిలో ఉంది. గత 4 సంవత్సరాలుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, తెలుపుతున్నారు.అంతేకాకుండా ఆమెకు ఓపెన్ హార్ట్ సర్జరీకి 2 లక్షల వరకు ఖర్చు అవుతుందని, వాపోతున్నారు.
ఆర్థిక సమస్యలతో ఓపెన్ హార్ట్ సర్జరీకి చెప్పించుకోలేకపోయానని ప్రస్తుతం మెడిసిన్స్ వాడుతున్నట్లుగా తెలుపుతున్నారు. రెండు సంవత్సరాల క్రితమే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సిందిగా డాక్టర్లు సూచించారని తెలుపుతున్నారు. తన భర్త షేక్ కలీముల టైలరింగ్ పై జీవనాధారం ఉందని అంటున్నారు. ప్రతి నెలా సుమారు 5000 రూపాయల మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది అని, తీవ్ర ఆర్థికంగా ఎదుర్కోవాల్సి వస్తుందని, ఎన్నిసార్లు పెన్షన్ కోసం దరఖాస్తులు పెట్టుకున్న రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సమస్యలతో ఓపెన్ హార్ట్ సర్జరీ చేపించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






