సత్తుపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షులుగా వినుకొండ

by velandi.Saikiran |

సత్తుపల్లి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా వినుకొండ రమేష్ నియమితులైయ్యారు. ఈ మేరకు జిల్లా పార్టీ నుండి ఉత్తర్వులు జారీ అయ

సత్తుపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షులుగా వినుకొండ
X

దిశ, సత్తుపల్లి: సత్తుపల్లి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా వినుకొండ రమేష్ నియమితులైయ్యారు. ఈ మేరకు జిల్లా పార్టీ నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి. పట్టణ పరిధిలోని 23 వార్డు కమిటీలు ప్రకటించారు. పట్టణ అధ్యక్షులుగా వినుకొండ రమేష్, ప్రధానకార్యదర్శిగా రాచర్ల మోహన్ రావు, ఉపాధ్యక్షులుగా పరుచూరి రమేష్ నియమితులైనారు.

ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు వాసిరెడ్డి రామనాధం, జిల్లా పార్లమెంటిరీ పార్టీ ప్రధానకార్యదర్శి కేతినేని హరీష్ చంద్రకు కృతజ్ఞతలు తెలిపారు. వీరి నియామకం పట్ల సీనియర్ నాయకులు పోట్రు వెంకట రామారావు, రాష్ట్ర బిసి సెల్ నాయకులు తిమ్మిడి రాంబాబు, తెలుగుయువత నాయకులు మల్లూరు మోహన్ రావు, రాచర్ల చందు, ఉండవల్లి, శ్రీకాంత్, కొంగల చెన్నకేశవ, మహిళా నాయకురుళ్ళు పోట్రు సరస్వతి, పలగాని రమ్య లు హర్షం వ్యక్తం చేసి నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Next Story