- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గ్రామాలకు వెలుగులు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామానికి మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్ తెలిపారు.

దిశ, ఏన్కూర్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామానికి మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్ తెలిపారు. మండల పరిధిలోని తిమ్మారావుపేట గ్రామంలో టీఎన్‌ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో సుమారు రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఏడీఏ (అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్) భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్ శాఖలో అనేక సంస్కరణలు చేపట్టి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. వైరా నియోజకవర్గంలో తిమ్మారావుపేట కేంద్రంగా విద్యుత్ శాఖకు సంబంధించిన రెవెన్యూ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఏడీఏ భవనంలో ఏడీఏ, ఏఈ, ఈఆర్‌వో తదితర విద్యుత్ శాఖ సేవలు ఒకేచోట అందుబాటులో ఉండటంతో, విద్యుత్ బిల్లులు మరియు ఇతర సమస్యల పరిష్కారం కోసం ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ శ్రీనివాసాచారి, ఎస్‌ఏఓ శ్రీధర్, డీఈలు బుద్ధుపవర్, రమేష్, ఏఓ శ్రీధర్, ఏడీఈ యాసీన్, ఏఈ ఉమాకాంత్, వెంకన్న, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






