- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వనవాసి విద్యార్థులకు అస్వస్థత..చర్ల వైద్య శాలకు తరలింపు
12 మంది ఆదివాసీ విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో గురువారం చోటు చోటు చేసుకుంది.

దిశ,చర్ల : 12 మంది ఆదివాసీ విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో గురువారం చోటు చోటు చేసుకుంది. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడ గా ఉంది. చర్ల మండల కేంద్రంలోని వనవాసి విద్యాలయం లో 29, మంది విద్యార్థులు ఉండగా ఒక్కసారి 12 మంది విద్యార్థులకు ఈ విష జ్వరాలు వైరల్ ఫీవర్ అంటుకోవడం తో అక్క సరిగా అసలు వనవాసి లో అక్కడ ఏం జరుగుతుంది అని చర్చించుకుంటున్నారు. వార్డెన్ అసలు పిల్లలను పట్టించుకోవడం లేదు అని కూడా విమర్శలు వున్నాయి.? ట్రస్ట్ ద్వారా అన్ని రకాల సదుపాయాలు అందుతున్న విద్యార్థులకు ఇలా జరగడంతో ఒక్కసారిగా చర్ల మండలం ఉలిక్కిపడింది.
రెండు రోజుల నుంచి జ్వరాలతో బాధపడుతున్న కనీసం హాస్పిటల్ కి తీసుకు రాకుండా అక్కడే సొంత వైద్యం చేస్తున్న వార్డెన్. అసలు పిల్లలకు సరైన పౌష్టికాహారం అందుతుందా లేదా అని స్థానికులు చర్చించుకుంటున్నారు . అదృష్టం వల్ల పిల్లలకు ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అసలు ఇలాంటి జ్వరాలు రావడానికి అసలు కారణం కలుషిత నీరు త్రాగడం వలన, చుట్టుపక్కల పరిశుభ్రంగా లేకపోవడం వలన ఇలాంటి జ్వరాలు వస్తూ ఉంటాయి ఇలాంటి వాటిని కూడా సరిగ్గా చూసుకోకపోతే వార్డెన్ వాచ్మెన్ మరియు అక్కడ వున్నా సిబ్బందికి ఎందుకని వాపోతున్నారు.






