ఉప్పాక బ్రిడ్జి సైడ్‌వాల్ ధ్వంసం.. పట్టించుకోని అధికారులు

by Kodari Anjali |

పినపాక మండల పరిధిలోని ఉప్పాక గ్రామానికి వెళ్లే కూడలిలో గల వాగుపై నిర్మించిన బ్రిడ్జి సైడ్‌వాల్ పూర్తిగా ధ్వంసమైంది.

ఉప్పాక బ్రిడ్జి సైడ్‌వాల్ ధ్వంసం.. పట్టించుకోని అధికారులు
X

దిశ, పినపాక: పినపాక మండల పరిధిలోని ఉప్పాక గ్రామానికి వెళ్లే కూడలిలో గల వాగుపై నిర్మించిన బ్రిడ్జి సైడ్‌వాల్ పూర్తిగా ధ్వంసమైంది. మణుగూరు-ఏటూరునాగారం ప్రధాన రహదారి కావడంతో పాటు ఇది నాలుగు రోడ్ల కూడలి. నిత్యం వందలాది వాహనాలు ఈ మార్గం గుండా రాకపోకలు కొనసాగిస్తుంటాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో వచ్చే వాహనదారులు సైడ్‌వాల్ లేకపోవడాన్ని గమనించక ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు . ప్రమాదాలను నివారించడానికి వంతెనకు ఇరువైపులా తాత్కాలికంగా ప్రమాద హెచ్చరిక బోర్డులు, రెడ్ రిబ్బన్ లేదా కర్రలతో కంచెను ఏర్పాటు చేయాలి. స్థానిక పంచాయితీ అధికారులు కానీ, రోడ్డు భవనాల శాఖ అధికారులు కాని ఏమి పట్టించుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి ఈ బ్రిడ్జ్ నిలువుటద్దు నిదర్శనం. ఇంకా ఎటువంటి ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Next Story