లో గ్రేడ్ బొగ్గు బుగ్గిపాలు

by velandi.Saikiran |

కోయగూడెం ఓసీలో అన్‌గ్రేడ్ బొగ్గు బుగ్గిపాలు అవుతోంది. గ్రేడ్ బొగ్గు మాత్రమే సరఫరా చేస్తుండగా, ఆన్‌గ్రేడ్ బొగ్గు నిల్వలు కొండలను తలపిస్తున్నాయి.

singareni coal
X

singareni coal

లో గ్రేడ్ బొగ్గు బుగ్గిపాలు

=కోయగూడెం ఓసీలో లక్షల టన్నుల మేర నిల్వ

=సొమ్ము చేసుకోవడంలో అధికారులు విఫలం

=ఎండలతో బొగ్గుకు మంటలు వ్యాప్తి

=సింగరేణికి కోట్లలో నష్టం

కోయగూడెం ఓసీలో అన్‌గ్రేడ్ బొగ్గు బుగ్గిపాలు అవుతోంది. కోయగూడెం ఓసీలో ప్రతిరోజు 3వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుండగా అందులో గ్రేడ్ బొగ్గు మాత్రమే సరఫరా చేస్తుండగా, ఆన్‌గ్రేడ్ బొగ్గు నిల్వలు కొండలను తలపిస్తున్నాయి. ప్రస్తుతం ఎండలకు అన్‌గ్రేడ్ బొగ్గు నిల్వలకు మంటలు అంటుకున్నాయి. కేఓసీ అధికారులు నామమాత్రంగా నీళ్లు పెట్టి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. గతంలో కేఓసీ నుంచి అన్‌గ్రేడ్ బొగ్గు ప్రైవేట్ పరిశ్రమలకు తరలించేలా ప్రతిరోజు ప్రతీ రోజు వందల సంఖ్యలో బాడీ లారీలకు అనుమతి ఇచ్చే వారు. కానీ ప్రస్తుతం పరిమిత సంఖ్యలో బాడీ లారీలకు అనుమతి ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. గతంలో మాదిరిగా బాడీ లారీలకు అనుమతి ఇచ్చి, ప్రైవేట్ పరిశ్రమలకు బొగ్గును విక్రయిస్తే ఆన్‌గ్రేడ్ బొగ్గు నిల్వలు ఎప్పుడో తగ్గిపోయేవి. కానీ అధికారుల ఉదాసీనత కారణంగా లక్షల టన్నుల అన్‌గ్రేడ్ బొగ్గు నిల్వలు బుగ్గి అవుతూ.. సింగరేణి సంస్థకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. మరోవైపు బొగ్గు నిప్పంటుకుని వచ్చే పొగలతో కేఓసీ సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులుకు గురవుతున్నారు. - దిశ, టేకులపల్లి

దిశ,టేకులపల్లి : కోయగూడెం ఓసీలో అన్ గ్రేడ్ బొగ్గు నిల్వలు లక్షల టన్నుల మేర పేరుకుపోయాయి. అన్‌గ్రేడ్ బొగ్గును కేఓసీ అధికారులు సొమ్ము చేసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారునే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఫలితంగా బొగ్గు నిల్వలు మంటల్లో బుగ్గి అవుతున్నాయి.

లక్షల టన్నుల మేర ఆన్గ్రేడ్ బొగ్గు నిల్వలు.

కోయగూడెం ఓసీలో ప్రతిరోజు 3000 టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతూ ఉంటుంది. కాగా బొగ్గులో నాణ్యత లేకపోవడంతో నాణ్యమైన బొగ్గును, షెల్‌ను వేరుచేసి కోల్ యార్డులలో నిలువ చేశారు. గ్రేడ్ బొగ్గును మాత్రమే సరఫరా చేస్తుండగా ఆన్‌గ్రేడ్ బొగ్గు నిల్వలు మాత్రం కొండలను తలపిస్తూ పేరుకుపోయాయి. గత రెండు మూడు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. కాగా ప్రస్తుతం ఎండలకు బొగ్గు నిల్వలకు మంటలు అంటుకున్నాయి. కేఓసీ అధికారులు నామమాత్రంగా నీళ్లు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. బొగ్గును ప్రవేట్ పరిశ్రమలకు ఎలా విక్రయించాలనే దానిపై శ్రద్ధ చూపకపోవడం శోచనీయం.

పొగతో సమీప గ్రామాలకు ముప్పు

బొగ్గు నిల్వలు ప్రతిరోజు కాలిపోతుండంతో దాని ద్వారా వచ్చే పొగలతో కోయగూడెం ఓసీ పరిసర ప్రాంతాలలో వాతావరణ కాలుష్యం పెరిగిపోయింది. ప్రజలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు బారిన పడే ప్రమాదం పొంచి ఉంది.

బాడీ లారీలకి ఎందుకు ఇవ్వడం లేదు..?

కేఓసీ నుంచి ప్రైవేట్ పరిశ్రమలకు ప్రతిరోజు బాడీ లారీల ద్వారా అనుగ్రేడ్ బొగ్గును తరలిస్తుంటారు. కానీ యాజమాన్యం పరిమిత సంఖ్యలో బాడీ లారీలకు అనుమతి ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. గతంలో ప్రతిరోజు వందల సంఖ్యలో బాడీ లారీలు చెక్‌పోస్ట్ సమీపంలోని యార్డ్ లోడింగ్ లేక రోజుల తరబడి ఎదురు చూసే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం నిల్వ ఉన్న బొగ్గుకు అనుగుణంగా ప్రైవేట్ పరిశ్రమలకు బొగ్గును విక్రయిస్తే ఆన్ గ్రేడ్ బొగ్గు నిల్వలు ఎప్పుడో తగ్గిపోయేవి. కానీ అధికారులు ఉదాసీలత కారణంగా లక్షల టన్నుల అన్‌గ్రేడ్ బొగ్గు నిల్వలు బుగ్గి అవుతున్నాయి. సింగరేణి సంస్థకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుంది. కేఓసీ అధికారుల నిర్వాకమే ఇందుకు ప్రధాన కారణమని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ విషయమై కోయగూడెం ఓసీ ప్రాజెక్టు అధికారి గోవిందరావును వివరణ అడిగేందుకు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ ఆయన స్పందించలేదు.

Next Story