టికెట్స్ లేకుండా థియేటర్లోకి చొరబడ్డ ప్రేక్షకులు.. తొక్కిసలాటలో ఇద్దరికి తీవ్ర గాయాలు

by Gugulothu.Kavitha |   (  Updated:2025-09-25 04:50:04  IST  )

భద్రాచలం ఏషియన్ థియేటర్ నందు గురువారం ఉదయం విషాద సంఘటన చోటుచేసుకుంది.

టికెట్స్ లేకుండా థియేటర్లోకి చొరబడ్డ ప్రేక్షకులు.. తొక్కిసలాటలో ఇద్దరికి తీవ్ర గాయాలు
X

దిశ, భద్రాచలం: భద్రాచలం ఏషియన్ థియేటర్ నందు గురువారం ఉదయం విషాద సంఘటన చోటు చేసుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓ జి సినిమాకి అందరికీ టికెట్స్ దొరకకపోవడంతో ప్రేక్షకులు టికెట్స్ లేకుండానే థియేటర్ లోకి చొరబడ్డారు. వందలాది మంది ఒకేసారి సినిమా హాల్ లోకి చొచ్చుకు రావడంతో టికెట్స్ తీసుకున్న వారు ఊపిరి ఆడక ఇబ్బందులకు గురయ్యారు. థియేటర్ యాజమాన్యం అడ్డుకున్నా వినకుండా ప్రేక్షకులు లోనికి తోసుకు వెళ్లడంతో తొక్కిసలాట జరిగి ఇద్దరు ప్రేక్షకులు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.

Next Story