రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి

by velandi.Saikiran |

టీయూసీఐ ఖమ్మం రాజకీయ తరగతులు నవంబర్ 9వ తేదీన నేలకొండపల్లిలో నిర్వ‌హించ‌నున్న‌ట్లు జిల్లా అధ్యక్షులు ఏ వెంకన్నతెలిపారు

రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి
X

దిశ,తల్లాడ: ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ( టీయూసీఐ) ఖమ్మం జిల్లా రాజకీయ తరగతులు నవంబర్ 9వ తేదీన నేలకొండపల్లిలో నిర్వ‌హించ‌నున్న‌ట్లు జిల్లా అధ్యక్షులు ఏ వెంకన్నతెలిపారు. శుక్రవారం తల్లాడ పట్టణంలో తల్లాడ, ఏన్కూర్ ఏరియా కమిటీ సమావేశంలో వారు పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో 10 గంటల పని విధానన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేబర్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చిన జీవో నెంబర్ 12న వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశం లో జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ లాల్మియా తల్లాడ,ఏన్కూర్ ఏరియా కమిటీ అధ్యక్షులు పటాన్ నాగుల మీరా, కార్యదర్శి డి.శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు డి.రమణ,ఈ సత్యం, సిహెచ్ రాఘవ, బడే మియా, రాఘవరావు, నరేష్, ప్రవీణ్, శ్రీను, రమేష్, రంగారావు,తదితరులు పాల్గొన్నారు.

Next Story