తొలి విడుత పోలింగ్ కు క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త : ఏసీపీ వ‌సుంధ‌ర యాద‌వ్

by Ratna Kumari |

దిశ, మధిర : గ్రామ పంచాయతీ మొదటి విడత పోలింగ్ కి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని

తొలి విడుత పోలింగ్ కు క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త : ఏసీపీ వ‌సుంధ‌ర యాద‌వ్
X

దిశ, మధిర : గ్రామ పంచాయతీ మొదటి విడత పోలింగ్ కి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. మధిర మండలం మొదటి విడత గ్రామ పంచాయితీ ఎన్నికల పురస్కరించుకొని ఎన్నికల బందో బస్త్ కు కేటాయించిన పోలీస్ సిబ్బంది యొక్క విధివిధానాలపై అవగాహన కార్యక్రమం మధిరలో నిర్వహించారు. ఈ సందర్బంగా ఏసీపీ మాట్లాడుతూ పోలింగ్, ఓట్ల లెక్కింపు సమయంలో పోలీస్ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేప‌ట్టాల‌న్నారు. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో ప్రతి పోలీస్ అధికారి సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల సమయంలో పోలీస్ అధికారులు గ్రామాల్లో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ, పోలీస్ కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లో గుంపులుగా లేకుండా జాగ్రత్తపడాలన్నారు. పోలింగ్ కేంద్రాలోకి ఓటర్లు వచ్చి వేళ్లే మార్గాలలో వాహనాలు పార్కింగ్ లేకుండా చూసుకోవాలన్నారు. ఏదైన‌ సమస్య తలెత్తినప్పుడు సంబంధిత అధికారులను సమచారం ఇవ్వడంతో పాటు అదనపు పోలీసు బలగాలను రప్పించుకోవాలన్నారు. కార్యక్రమంలో సిఐ రమేష్, ఎస్సై బి లక్ష్మి భార్గవి పాల్గొన్నారు.

Next Story