నేడు తుది విడత సం‘గ్రామం’

by velandi.Saikiran |

ఖమ్మం జిల్లాలో ఈ నెల17తేదీ బుధవారం మూడో విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆఖరి సమరానికి వివిధ

నేడు తుది విడత సం‘గ్రామం’
X

నేడు తుది విడత సం‘గ్రామం’

మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం

భద్రాద్రి 7, ఖమ్మంలో ఏడు మండలాలు..

ఖమ్మంలో 168గ్రామ పంచాయతీలు, 1372 వార్డులు

భద్రాద్రిలో145పంచాయతీలు, 1071వార్డులు

2,44,283మంది ఓటర్లకు 1372 పోలింగ్ కేంద్రాలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుది విడత ఎన్నికలకు సర్వసిద్ధమైంది. ఖమ్మం జిల్లాలో ఏడు మండలాల్లోని 168గ్రామ పంచాయతీలకు , 1372వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక్కడ మొత్తం 2,44,283మంది ఓటర్లు ఉండగా, 1372 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏడు మండలాల్లో మిగిలిన 145సర్పంచ్ స్థానాలకు, 1,071వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ మొత్తం 1,75,074మంది ఓటర్లకు గానూ 1,258 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగించనున్నారు. రెండు గంటల నుంచి కౌంటింగ్ చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. అంతకు ముందు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రితో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ నిర్వహణపై ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఎన్నికల అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించేలా పోలీస్ అధికారులకు సీపీ, ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. - దిశ, ఖమ్మం కార్పొరేషన్/ ప్రతినిధి కొత్తగూడెం

దిశ, ఖమ్మం కార్పొరేషన్/ ప్రతినిధి కొత్తగూడెం: ఖమ్మం జిల్లాలో ఈ నెల17తేదీ బుధవారం మూడో విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆఖరి సమరానికి వివిధ రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. ఎక్కువ సీట్లు గెలుచుకునేందుకు కసరత్తు చేస్తున్నాయి.

జిల్లాలో 7మండలాల్లో ఎన్నికలు

జిల్లాలోని ఏడు మండలాలు ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూర్, సింగరేణి మండలాల పరిధిలో ఉన్న 191 గ్రామ పంచాయతీలు, 1742వార్డులకు మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహణకు గతంలో నోటిఫికేషన్ జారీ చేసి, నామినేషన్లు స్వీకరించారు. మూడవ విడతలో ఒక గ్రామ పంచాయతీ, 9వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. కాగా 22గ్రామ పంచాయతీలు, 361వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 168గ్రామ పంచాయతీలకు , 1372వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. సర్పంచ్ బరిలో 485మంది, వార్డు సభ్యుల స్థానాలకు 3369మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పోలింగ్ నిమిత్తం 2091బ్యాలెట్ బాక్సులు, 2092పోలింగ్ అధికారులు, 2637 మంది ఓపీఓలను సిద్ధం చేయగా, 1372 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. మూడో విడతలో 31లొకేషన్స్‌లోని 318క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, అక్కడ సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు

మొత్తం 2, 44,283మంది ఓటర్లు..

మూడో విడత పంచాయతీ ఎన్నికలలో మొత్తం 2,44,283మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 1,18,900మంది పురుష, 1,25,380మంది మహిళా, ముగ్గురు ఇతరులు ఉన్నారు. పోలింగ్ కు తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు.

భద్రాద్రిలో ఏడు మండలాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అళ్లపల్లి, గుండాల, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, జూలూరుపాడు, టేకులపల్లి, ఇల్లందు మండలాలకు తుది విడుత ఎన్నికలు జరగనున్నాయి. తుది విడతలో జిల్లాలో మొత్తం 156 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, జూలూరుపాడు గ్రామపంచాయతీకి సంబంధించిన కోర్టు కేసు పెండింగ్‌లో ఉన్న కారణంగా ఆ గ్రామపంచాయతీకి ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా వెలువడలేదు. ఈ నేపథ్యంలో, మొత్తం సర్పంచ్ స్థానాలలో 10 స్థానాలు ఏకగ్రీవంగా కాగా మిగిలిన 145సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. తుది విడతలో మొత్తం 1,330 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, వాటిలో 256వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఆళ్లపల్లి మండలం అడవి రామవరం గ్రామపంచాయతీ పరిధిలోని ఒకటవ వార్డు స్థానానికి నామినేషన్ తిరస్కరించగా, అభ్యర్థులు లేని కారణంగా మూడో వార్డు, ఇల్లెందు మండలం బోయ తండా ఆరో వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదని తెలిపారు. మిగిలిన 1,071వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. తుది విడతలో 1,75,074 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించనున్నారు. ఇందులో 85,712 మంది పురుషులు, 89,359 మంది మహిళలు, 3 మంది ఇతరులు ఉన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాలో మొత్తం 1,258 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

Next Story