- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్త ఆచూకీ కోసం భార్య ఫిర్యాదు..
by Batti.Sumithra |
భార్యాభర్తల తగాదాలతో అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తన భర్త ఆచూకీ కోసం ఓ మహిళ మంగళవారం తిరుమలాయపాలెం పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

X
దిశ, తిరుమలాయపాలెం : భార్యాభర్తల తగాదాలతో అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తన భర్త ఆచూకీ కోసం ఓ మహిళ మంగళవారం తిరుమలాయపాలెం పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి మండలంలోని బీరోలు గ్రామానికి చెందిన నాయిని పట్టాభి (47), భార్య మనోరంజని దంపతులు ఆ దంపతులకు 20 సవంత్సరాల కొడుకు ఉన్నాడు.
గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తగాదాల జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇదే నెల 9వ తారీఖున, రాత్రి 9గంటల సమయంలో తన భర్త పట్టాభి బైటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. చుట్టుపక్కల గ్రామాల్లో ఎతికినా ఆచూకీ లభ్యం కాలేదని తెలిపిందన్నారు. మనోరంజని ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Next Story






