- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది.. నేటి నుంచే శుభ ఘడియలు ప్రారంభం
ముహూర్తాల కోసం వేచి చూస్తున్న శుభకార్యాల సీజన్ వచ్చేసింది. ఫిబ్రవరి19 నుంచి అత్యంత అనుకూలమైన శుభ ఘడియలు ప్రారంభం కానున్నాయి.

పెళ్లి బాజాలకు వేళాయె
ముహూర్తాల సందడి మొదలు
నేటి నుంచే శుభ ఘడియలు ప్రారంభం..
కళకళలాడనున్న ఫంక్షన్ హాల్స్
ముహూర్తాల కోసం వేచి చూస్తున్న శుభకార్యాల సీజన్ వచ్చేసింది. నేటి నుంచి అత్యంత అనుకూలమైన శుభ ఘడియలు ప్రారంభం కానుండటంతో జిల్లా వ్యాప్తంగా పండగ వాతావరణం కనిపిస్తోంది. శూన్య మాసాల ప్రభావంతో నిలిచిపోయిన శుభకార్యాలు మళ్లీ ఊపందుకోనుండగా, జిల్లాలోని వ్యాపారవర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ముహూర్తాల తేదీల్లో ఫంక్షన్ హాళ్లకు డిమాండ్ పెరిగింది. చాలా చోట్ల ఇప్పటికే ముందస్తు బుకింగ్‌లు పూర్తయ్యాయి. వంట చేసేవారు, బ్యాండ్ మేళం, ఈవెంట్ ఆర్గనైజర్లు, ఫొటోగ్రాఫర్లకు గిరాకీ ఒక్కసారిగా పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ రావడంతో దినసరి కూలీలకు, నిర్వహణ పనులపై ఆధారపడిన కార్మికులు, సహాయకులు, ఇతర వృత్తిదారులకు రాబోయే రెండు నెలల పాటు చేతినిండా పని లభించనుంది.
దిశ, బూర్గంపాడు: ముహూర్తాల కోసం వేచి చూస్తున్న శుభకార్యాల సీజన్ వచ్చేసింది. ఫిబ్రవరి19 నుంచి అత్యంత అనుకూలమైన శుభ ఘడియలు ప్రారంభం కానుండటంతో జిల్లా వ్యాప్తంగా పండగ వాతావరణం కనిపిస్తోంది. ఆగస్టు నుంచి అక్టోబరు వరకు చతుర్మాసం, శూన్య మాసాల ప్రభావంతో నిలిచిపోయిన శుభకార్యాలు, నవంబరు నుంచి మళ్లీ ఊపందుకోనున్నాయి. ఈనెల19వ తేదీ (బుధవారం)నుంచి వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, నిశ్చితార్థాలకు వేద పండితులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
వ్యాపారాల్లో కొత్త జోష్..
శుభకార్యాల రాకతో జిల్లాలోని వ్యాపార వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ముహూర్తాల తేదీల్లో ఫంక్షన్ హాళ్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. చాలా చోట్ల ఇప్పటికే ముందస్తు బుకింగ్‌లు పూర్తయ్యాయి. పందిళ్లు, డెకరేషన్లు,సౌండ్ బాక్సులు,డీజే నిర్వాహకులకు తీరిక లేని పని దొరుకుతోంది. వంట చేసేవారు, బ్యాండ్ మేళం, ఈవెంట్ ఆర్గనైజర్లు, ఫొటోగ్రాఫర్లకు గిరాకీ ఒక్కసారిగా పెరిగింది.
వేలాది మందికి ఉపాధి
ఈ పెళ్లిళ్ల సీజన్ కేవలం కుటుంబాలకే కాదు, వేలాది మంది దినసరి కూలీలకు కూడా వరంగా మారనున్నది. నిర్వహణ పనులపై ఆధారపడిన కార్మికులు, సహాయకులు, ఇతర వృత్తిదారులకు రాబోయే రెండు నెలల పాటు చేతినిండా పని లభించనుంది. జిల్లాలో ఎక్కడ చూసినా పెళ్లి పనుల హడావుడి, సందడి నెలకొంది.
నేటి నుంచి శుభ ఘడియలు
ఈ నెల నుంచి డిసెంబరు వరకు వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, నిశ్చితార్థాలకు అత్యంత బలమైన ముహూర్తాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది మే నెలలో అధిక మాసం రానుండటంతో, దానికి ముందే చాలా మంది తమ ఇంటి శుభకార్యాలను పూర్తి చేసుకోవాలని సంకల్పించుకుంటున్నారు.ప్రతి ఒక్కరూ తమ తమ జాతక రీత్యా, నక్షత్ర బలాన్ని బట్టి పురోహితులను సంప్రదించి సరైన ముహూర్తాన్ని నిర్ణయించుకోవాలి. లగ్న బలం బాగుంటే ఆ కార్యం నిర్విఘ్నంగా సాగిపోతుంది. అందరికీ ఆ దైవ ఆశీస్సులు లభించాలని, మీరు చేసే ప్రతి శుభకార్యం మంగళప్రదంగా జరగాలని కోరుకుంటున్నాను. - ప్రసాద్ పండితుడు, బూర్గంపాడు






