- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దివ్యాంగుల వివాహానికి తెలంగాణ ప్రభుత్వం భారీ గిఫ్ట్
ఖమ్మం జిల్లాలో దివ్యాంగుల వివాహాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.1 లక్ష ప్రోత్సాహక బహుమతి అందిస్తోంది.

దిశ బ్యూరో, ఖమ్మం : ఖమ్మం జిల్లాలోని దివ్యాంగులు- సకలాంగులు, దివ్యాంగులు- దివ్యాంగులు వివాహం చేసుకున్న వారికి తెలంగాణ ప్రభుత్వం వివాహ ప్రోత్సాహక బహుమతి కింద 1,00,000 (ఒక లక్ష రూపాయలు)మంజూరు చేస్తుందని జిల్లా సంక్షేమ అధికారి వేల్పుల విజేత తెలియచేశారు. వివాహం చేసుకున్న జంటలు వివాహం చేసుకున్న తేదీ నుండి సంవత్సరం లోపు http://tgepass.cgg.gov.in అనే ప్రభుత్వ వెబ్సైట్ నందు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఆ దరఖాస్తు ఒరిజినల్, సంబంధిత జిరాక్స్ పత్రాలు జిల్లా సంక్షేమ అధికారి మహిళా శిశు వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కొత్త కలెక్టరేట్ కార్యాలయం రెండవ అంతస్తు ఎస్ 31 వీవీ పాలెం ఖమ్మం నందు సమర్పించ వలెనని తెలిపారు. దరఖాస్తులను పరిశీలించి వారి అర్హతను బట్టి విచారణ అనంతరము నిధులు వచ్చిన వెంటనే నేరుగా బ్యాంక్ అకౌంట్కు జమ చేస్తారని వెల్లడించారు. వివరములకు జిల్లా సంక్షేమ అధికారి ఖమ్మం కార్యాలయంలో సంప్రదించగలరని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని దివ్యాంగులు అందరూ ఉపయోగించుకోవాలని, దీనికి సీలింగ్ లేదని అర్హత ఉన్న ఎంతమంది అయినా దరఖాస్తు చేసుకోవచ్చని వేల్పుల విజేత ఒక ప్రకటనలో తెలియజేశారు.






