టీడబ్ల్యూజేఎఫ్ మహాసభల పోస్టర్ ను ఆవిష్కరించిన కలెక్టర్

by Nallavelli.Anjaneyulu |

దిశ బ్యూరో, ఖమ్మం : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఖమ్మం జిల్లా మూడో మహాసభల పోస్టర్

టీడబ్ల్యూజేఎఫ్ మహాసభల పోస్టర్ ను ఆవిష్కరించిన కలెక్టర్
X

దిశ బ్యూరో, ఖమ్మం : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఖమ్మం జిల్లా మూడో మహాసభల పోస్టర్ ను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. మహాసభలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా యూనియన్ నేతలు కలెక్టర్ ను మహాసభలకు ఆహ్వానించారు. కలెక్టర్ సుముఖత వ్యక్తం చేశారు. ఈనెల 20న ఖమ్మంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ లో నిర్వహించే ఖమ్మం జిల్లా మూడో మహాసభలను విజయవంతం చేయాల్సిందిగా యూనియన్ జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అడ్ హక్ కమిటీ సభ్యులు సయ్యద్ ఖదీర్ పిలుపునిచ్చారు. శనివారం ఉదయం 9 గంటలకు మహాసభలు ప్రారంభమవుతాయని తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నికరంగా పోరాడేది టీడబ్ల్యూజేఎఫ్ మాత్రమే అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూనియన్ ఉపాధ్యక్షుడు గరిడేపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు దువ్వ సాగర్, కూరాకుల గోపి, ఆవుల శ్రీనివాస్, కొత్త యాకేష్, మానుకొండ రవి కిరణ్, పత్తి శ్రీను మధుశ్రీ, గణేష్, అర్షద్ తదితరులు ఉన్నారు.

Next Story