- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అధిక వేడికి పది టన్నుల చేపలు మృతి..
మృగశిర కార్తె నాడు పాపకొల్లు గ్రామంలోని దండ్యాల చెరువులో ఏకంగా 10 టన్నుల చేపలు ఎండ వేడిమికి మృతి చెందడంతో మత్స్యకారులు లబోదిబోమంటున్నారు.

దిశ, జూలూరుపాడు: చేప పిల్లలను చెరువులో వదిలిపెట్టిన తర్వాత వాటి ఆలనా పాలన చూసుకొని అవి ఒక సైజుకు వచ్చిన తర్వాత వాటిని విక్రయించి మత్స్యకారులు జీవనం సాగిస్తుంటారు. పూర్తిగా చెరువులపై ఆధారపడి జీవనం సాగించే మత్స్యకారులకు 'జల పుష్పాలతో' విడదీయరాని బంధం ఏర్పడుతుంది. చేపలన్ని కేజీ బరువు దాటిన తర్వాత వాటిని మత్స్యకారులు కలిసి వలలు వేసి పట్టి విక్రయించి వచ్చిన సొమ్మును అందరు పంచుకుంటారు. ఇలా ప్రతి ఏడాది ఆదాయాన్ని తెచ్చే చేపలు మృగశిర కార్తె నాడు చనిపోయి ఉండడాన్ని చూసి మత్స్యకారులంతా లబోదిబోమంటున్నారు. ఏం జరిగిందో ఏమో తెలియదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 టన్నుల చేపలు చనిపోయి ఉండడాన్ని చూసి మత్స్యకారులందరూ బోరును వినిపించారు. తమ కుటుంబాలకు అండగా నిలిచే చెరువులోని చేపలు ఒక్కసారిగా చనిపోయి ఉండడం, అది కూడా మృగశిర కార్తె నాడు మంచి డిమాండ్ ఉన్న సమయంలోనే చేపలు చనిపోయి ఉండడాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన చెందుతున్నారు. అధిక వేడి కారణంగానే చేపలు మృతి చెందాయని మత్స్యకారులు వాపోతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని పాపకొల్లు గ్రామంలోని దండ్యాల చెరువులో చాపలు ఎండ వేడి అధికంగా ఉండటంతో నీటి శాతం తగ్గిపోయి మృతి చెందాయి. గ్రామానికి చెందిన గిరిజన మత్స్యకారులు ప్రతి సంవత్సరం చేప పిల్లలను చెరువులో వేసి పెంచుతూ ఉంటారు. అయితే మృగశిర కార్తె కావడంతో చేపలు తినేందుకు ప్రజలు ఆసక్తి చూపడంతో చెరువులో చేపలు పట్టేందుకు మత్స్యకారులు సన్నద్ధమై చెరువు వద్దకు వెళ్లగా మృతి చెందిన చాపలు చెరువుపై నీటిలో తేలియాడుతూ కనిపించాయి. మృతి చెందిన చాపలను చూసి మృత్యుకారులు కన్నీటి పర్యంతమయ్యారు. ఎంతో శ్రమించి చెరువులో పెంచిన చాపలు చనిపోవడంతో తీవ్ర నష్టం వాటిలిందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో చెరువులో నీటి శాతం బాగా తగ్గిపోయిందని, దీంతో చెరువులో ఉన్న చాపలు మృతి చెందాయని మత్స్యకారులు తెలిపారు. సుమారు 10 టన్నుల చాపలు మృతి చెందాయని, దీంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని మత్స్యకారులు వేడుకుంటున్నారు.






