బూర్గంపాడు పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ప‌టిష్ట బందోబ‌స్తు

by Ratna Kumari |

దిశ-​బూర్గంపాడు : బూర్గంపాడు ​మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా

బూర్గంపాడు పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ప‌టిష్ట బందోబ‌స్తు
X

దిశ-​బూర్గంపాడు : బూర్గంపాడు ​మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ భద్రతా చర్యలు చేపట్టారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, క్రమశిక్షణతో ఓటు హక్కు వినియోగించుకునేలా డీఎస్పీ అధికారులకు, ఓటర్లకు తగిన సలహాలు,సూచనలు చేశారు.​ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ఓటు వేయడం పూర్తయిన తర్వాత ఓటర్లు ఎవరూ కూడా పోలింగ్ కేంద్రాల సమీపంలో గుమికూడదు. తక్షణమే అక్కడి నుంచి వెళ్లిపోవాలని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఓటింగ్ ప్రశాంతంగా పూర్తయ్యేలా అందరూ సహకరించాలని సూచించారు. ఈ భద్రతా ఏర్పాట్లలో డీఎస్పీ సతీష్ కుమార్ తోపాటు స్థానిక ఎస్ఐలు మేడ ప్రసాద్, నాగబిక్షం పాల్గొన్నారు.

Next Story