- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
warehouses : గోదాములను పరిశీలించిన రాష్ట్రగిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు..
ఖమ్మం రూరల్ మండలంలోని పెద్దతండా, ఖమ్మం వ్యవసాయ మార్కెట్, రఘునాథపాలెం మండలంలోని జింకలగూడెం గ్రామంలోని గోదాములను గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు సోమవారం సందర్శించారు.

దిశ, ఖమ్మం రూరల్ : ఖమ్మం రూరల్ మండలంలోని పెద్దతండా, ఖమ్మం వ్యవసాయ మార్కెట్, రఘునాథపాలెం మండలంలోని జింకలగూడెం గ్రామంలోని గోదాములను గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు సోమవారం సందర్శించారు. గోదాముల్లో ఉన్న నిల్వలను ఆయన పరిశీలించారు. గోదాముల సామర్ధ్యంతో పాటు ఎంతమంది హమాలీలు ఉన్నారు వంటి తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని గోడౌన్ ఇంచార్జికి నాగేశ్వరరావు సూచించారు.
తొలిసారిగా గోడౌన్ కి వచ్చిన చైర్మన్ కి గోడౌన్ సిబ్బంది శాలువాతో సన్మానించారు. అనంతరం చైర్మన్ నాగేశ్వరరావు గోదాము ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహ్మద్ జావిద్, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్క శేఖర్ గౌడ్, పద్మావతి, మేనేజర్ సుందర్ లాల్, కార్పొరేటర్ మలీదు వెంకటేశ్వర్లు, బచ్చలికూరి నాగరాజు, జెర్రిపోతుల అంజనీ, కిశోర్, హరినాయక్, పూల్సింగ్, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.






