Srinagar street : ఆదమరిస్తే అంతే సంగతి.. ప్రమాదకరంగా శ్రీనగర్ వీధి !

by Batti.Sumithra |

ఈ దారి ప్రమాదానికి సూచిస్తుంది.. అయినప్పటికీ అధికారులకు కనిపించకపోవడం విచారకరం..

Srinagar street : ఆదమరిస్తే అంతే సంగతి.. ప్రమాదకరంగా శ్రీనగర్ వీధి !
X

దిశ, కొత్తగూడెం రూరల్ : ఈ దారి ప్రమాదానికి సూచిస్తుంది.. అయినప్పటికీ అధికారులకు కనిపించకపోవడం విచారకరం.. ఈ దారికి ఇరువైపులా డ్రైనేజీ ఉండగా అది సరిగా లేకపోవడం వల్ల ఆందోళన కలిగిస్తుంది.. ఆదమరిస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉన్నా ఎవరు పట్టించుకోకపోవడం దారుణం.. ప్రమాదాలు జరిగితేనే అధికారులు స్పందించే పరిస్థితి ఉందంటూ ప్రజలు విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి నెలకొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం పరిధిలోని దివంగత మాజీమంత్రి కోనేరు నాగేశ్వరావు ఇంటికి వెళ్లే రహదారి ప్రమాదకరంగా నిలుస్తుంది.

శ్రీనగర్ ఒకటో లైన్ కి వెళ్లే ఈ దారి ప్రమాదానికి సూచికగా నిలుస్తున్నప్పటికీ ఎవరు పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారి గుండా ద్విచక్ర వాహనాలు వెళ్తున్నప్పుడు వారంతా భయాందోళన చెందుతున్నారు. పొరపాటున ద్విచక్ర వాహనం జారీ డ్రైనేజీల బండి పడితే పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. రోడ్డు డ్రైనేజీ సమస్య గత కొద్దిరోజులుగా కనిపిస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు

Next Story