డోలినే స్ట్రెక్చర్...పడవలే అంబులెన్స్‌..ఆ గిరిజ‌నుల బ‌తుకే ఆగం

by velandi.Saikiran |

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పరిధిలో గల జీనబాడు పంచాయతీకి చెందిన వలసల గురువు గ్రామంలో రోడ్డు సదుపాయం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

డోలినే స్ట్రెక్చర్...పడవలే అంబులెన్స్‌..ఆ గిరిజ‌నుల బ‌తుకే ఆగం
X

దిశ, భద్రాచలం: దేశానికి స్వాతంత్రం వచ్చి 8 దశాబ్దాలు వ‌చ్చినా గిరి పల్లెలలో ప్రజలు దుర్భర పరిస్థితులలోనే జీవిస్తున్నారు. తెలంగాణా, ఆంధ్ర సరిహద్దు లోని కొన్ని గిరిజన గ్రామాలకు రహదారి, విద్యుత్ సౌకర్యం లేదంటే ఆశ్చర్యం కలుగకమానదు. రోగం వస్తే, సూది మందు కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి కొండలు, గుట్టలు ఎక్కి, సెలయేర్లు దాటాల్సిందే. ఆ గ్రామాలలో అత్యవసరం అయితే డోలిలే స్ట్రెక్చర్, పడవలే వారికి అంబులెన్స్. మారుమూల గిరిజనుల దుస్థితికి బుధవారం చోటుచేసుకున్న ఈ సంఘటన అద్దం పడుతుంది.

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పరిధిలో గల జీనబాడు పంచాయతీకి చెందిన వలసల గురువు గ్రామంలో రోడ్డు సదుపాయం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ త‌రుణంలోనే అనారోగ్యానికి గురైన తామర్ల పొట్టమ్మ(56)ను ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు డోలి సాయంతో డ్యామ్ వరకు తీసుకెళ్లాల్సి వచ్చింది. అక్కడినుండి ఒడ్డు చేరేందుకు నాటు పడవపై గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది. అనంతరం ఒడ్డుకు చేరుకుని ఆటోలో ఆస్పత్రికి తరలించారు. అలాగే గ్రామంలో ఉన్న 15 మంది పిల్లలు సమీపంలోని కొత్త బురుగ పాఠశాలకు వెళ్లాలంటే సుమారు మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు నాటు పడవపై ప్రయాణం చేయవలసి వస్తోంది. దీనిపై తల్లితండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త‌మ స‌మ‌స్య‌ల‌కు పరిష్కారం చూపించాల‌ని కోరుతున్నారు.





Next Story