వరినారు మడి కాదు, ఇది బుర‌ద దారి!

by velandi.Saikiran |

చిత్రంలో అచ్చం వరినారు మడిలాగా కనిపిస్తున్న దృశ్యం చూసి, మీరు నారు మడి అనుకుంటే బురదలో కాలేసినట్లే

వరినారు మడి కాదు, ఇది బుర‌ద దారి!
X

దిశ, తిరుమలాయపాలెం: చిత్రంలో అచ్చం వరినారు మడిలాగా కనిపిస్తున్న దృశ్యం చూసి, మీరు నారు మడి అనుకుంటే బురదలో కాలేసినట్లే. తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలు గ్రామంలోని 1,6 వార్డుల్లో వరద,బురదతో ఇలా తయారైంది. ఖమ్మం-వరంగల్ హైవే నుంచి గ్రామంలోనికి వెళ్లే ఈ దారి, వర్షం వస్తే వరద నీరు చేరుతుంది. దీంతో స్థానికులకు సమీపంలోనే హైవే ఉన్నప్పటికీ,ముక్కు చూపించేందుకు తల చుట్టూ చెయ్యి తిప్పినట్లుగా.. వేరే దారుల్లో హైవే హైవే వెక్కాల్సి వస్తుందని ఆరోపిస్తున్నారు. అలా అని గ్రామానికి ఆదాయమేమి లేక కాదు.

గ్రామంలో షాపింగ్ కాంప్లెక్స్ లు గ్రామ పంచాయతీ పరిధిలో ఉండగా,వాటికి నెలకు సుమారు రూ.12వేల రూపాయల ఆదాయం వస్తోంది. దీంతోపాటు వారంతపు సంత ఉన్నది. వేలంపాటలో వారాంతపు సంత రూ.30. లక్షల రూపాయలకు పైగానే ఈ సారి వేలం పలికింది. ఆదాయం వ‌చ్చినా, గ్రామంలో సమస్యలు మాత్రం తీరడం లేదని స్థానికులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.బురదమయం అయిన వీధుల్లో కనీసం మట్టి పోయిస్తే కొంతవరికైనా సమస్య తీరుతుందని అంటున్నారు. దీనిపై ఎన్నిసార్లు పంచాయతీ కార్యదర్శికి చెప్పిన పట్టించుకోవడం లేదని, ఏండ్లుగా ఈ సమస్య వెంటాడుతోంద‌ని అంటున్నారు.

పంచాయతీ కార్యదర్శి రాము వివరణ

వచ్చిన ఆదాయనాన్ని ట్రెజరరీలో జమ చేశామని పేర్కొన్నారు పంచాయతీ కార్యదర్శి రాము. బిల్లులు రావడం లేటు అవుతుండడం వలన, పనులు చేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదని తెలిపారు.

Next Story