చేపల వేట..చెరువులు ఖాళీ

by velandi.Saikiran |   (  Updated:2026-05-13 22:30:15  IST  )

ఒక వైపు ఎండలు భగభగ మండిపోతున్నాయి. ఎండల తీవ్రతకు నీటి వినియోగం గణనీయంగా పెరుగుతుంది.

చేపల వేట..చెరువులు ఖాళీ
X

చేపల వేట.. చెరువులు ఖాళీ

విలువైన నీరు తూముల ద్వారా విడుదల

తాగు, సాగునీటికి కొరత ఏర్పడే ప్రమాదం

చోద్యం చూస్తున్న నీటిపారుదల శాఖ

ఓ వైపు ఎండలు మండుతుండగా నీటి వనరులను సంరక్షించుకుని తాగునీటి అవసరాలను తీర్చుకోవాల్సిన తరుణంలో చెరువుల నుంచి అక్రమంగా నీటిని బయటకు పంపుతున్నారు. కొణిజర్ల మండలంలోని గుబ్బగుర్తి, కొణిజర్ల, పెద్ద మునగాల, పెద్ద గోపతి తదితర చెరువులు నీటితో నిండి ఉన్నా.. చేపల వేట కోసం చెరువుల నుంచి తూముల ద్వారా నీటిని బయటకు పంపిస్తున్నారు. ఈ ప్రక్రియ ప్రతి ఏడాది నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటున్నా పట్టించుకునే నాథుడు లేడు. నీటిని బయటకు వెళ్లకుండా తెప్పల సాయంతో చేపలను పట్టే అవకాశం ఉన్నా కొందరు మత్స్యకారులు నీటిని బయటకు పంపేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటి తాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతున్నది. - దిశ, కొణిజర్ల

దిశ కొణిజర్ల: ఒక వైపు ఎండలు భగభగ మండిపోతున్నాయి. ఎండల తీవ్రతకు నీటి వినియోగం గణనీయంగా పెరుగుతుంది. ఎండల తీవ్రతకు భూగర్భ జలాల అడుగంటుతున్నాయి. ఉన్న నీటి వనరులను సంరక్షించుకొని తాగునీటి అవసరాలను తీర్చుకోవాల్సిన తరుణంలో చెరువుల నుంచి అక్రమంగా నీటిని బయటకు పంపుతున్నారు. వేసవికాలం కావడంతో చాపలను పట్టేందుకు చెరువుల నుంచి నీటిని అక్రమంగా బయటికి పంపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చెరువుల నుంచి నీటిని వృథాగా బయటకు పంపిస్తే భూగర్భ జలాలు అడుగంటి తాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. అయినప్పటికీ కొంతమంది తమ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం విలువైన నీటిని వృథా చేస్తున్నారు.

అక్రమ నీటి వృథా వివరాలను పరిశీలిస్తే... ఏప్రిల్ చివరి వరకు సాగర్ నీళ్లు రావడంతో గ్రామీణ ప్రాంతాల చెరువులో మే నెలలో కూడ నిండు కుండలా నీటితో కళకళలాడుతున్నాయి. గుబ్బగుర్తి, కొణిజర్ల, పెద్ద మునగాల, పెద్ద గోపతి తదితర చెరువులు నీటితో నిండి ఉన్నాయి. సాధారణంగా ప్రతి ఏడాది చెరువులలో చేపల పట్టే ప్రక్రియ మే నెలలో కొనసాగుతుంది. చేపల వేట కోసం చెరువుల నుంచి తూముల ద్వారా నీటిని బయటకు పంపిస్తుంటారు. ఈ ప్రక్రియ ప్రతి ఏడాది నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటున్నా పట్టించుకునే నాథుడు లేడు. నీటిని బయటకు వెళ్లకుండా తెప్పల సాయంతో చేపలను పట్టే అవకాశం ఉన్నా మత్స్యకారులు మాత్రం నీటిని బయటకు పంపేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. చెరువుల నుంచి నీటిని వృథాగా బయటకు పంపడంతో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు బావులు ఎండిపోయి తాగునీటి సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. చెరువులు ఎండి పోతే మూగజీవాలు తాగేందుకు నీరు దొరకగా మృత్యువాత పడే ప్రమాదం ఉంది. తొలకరిలో వర్షాలు ఆలస్యమైతే చెరువుల్లో నీళ్ళు లేకుంటే రైతులు ముందుగానే వరినార్లు పోసుకునేందుకు అవకాశం ఉండదు. తాగు తాగునీటికి ఉపయోగపడే ఎంతో విలువైన నీటిని వృధాగా బయటకు వెళ్ళదీస్తున్న నీటిపారుదల శాఖ అధికారుల చోద్యం చూస్తుండటం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story