ఆ ప్రాంతాల నుంచే గంజాయి రవాణా పెరిగింది: SP సునీల్ దత్

by Web Desk |
ఆ ప్రాంతాల నుంచే గంజాయి రవాణా పెరిగింది: SP సునీల్ దత్
X

దిశ, కొత్తగూడెం: అక్రమంగా గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. మంగళవారం మీడియా సమావేశంలో ఎస్పీ సునీల్ దత్ మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి రవాణాపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నామని అన్నారు. ప్రధానంగా ఆంధ్రా, ఛత్తీస్‌ఘఢ్, ఒరిస్సా, సీలేరు, వైజాగ్ వంటి ప్రాంతాల నుండి గంజాయి ఎగుమతి అధికంగా జరుగుతుందని వెల్లడించారు. భద్రాద్రి జిల్లా మీదుగా రవాణా అవుతున్న గంజాయిని అనేకసార్లు భారీ మొత్తంలో పట్టుకున్నామని అన్నారు. అనేక రాష్ట్రాల నుండి మొత్తం 106 మంది గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించామని, వారిపై హిస్టరీ షీట్స్ ఓపెన్ చేస్తున్నట్లు తెలిపారు. మరో 20 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని అన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు గంజాయి రవాణాపై నిరంతరం నిఘా పెట్టారని, పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని గిరిజన ప్రాంతాల్లో పంట పొలాల్లో గంజాయి సాగు చేస్తున్నట్లు తెలిసిందని, ఈ అంశంపై సర్పంచులతో చర్చిస్తామని అన్నారు. గంజాయి రవాణాపై అన్ని డివిజన్ల డీఎస్పీలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలతో చర్చించి విద్యార్థులపై గంజాయి ప్రభావాన్ని రూపుమాపే విధంగా ప్రత్యేక సదస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా ప్రజలు ఎక్కడైనా గంజాయి విక్రయాలు, సరఫరా జరుపుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సునీల్ దత్ కోరారు.


Next Story

Most Viewed