జోరుగా మట్టి దందా.. అధికారులకు నెల.. నెల కాసులు కురిపిస్తున్న వ్యాపారం!

by Disha Web Desk 13 |
జోరుగా మట్టి దందా.. అధికారులకు నెల.. నెల కాసులు కురిపిస్తున్న వ్యాపారం!
X

దిశ, సత్తుపల్లి: సత్తుపల్లి లో ఎటువంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా మట్టిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. మండల పరిధిలోని పాత కొమ్మిపల్లి సింగరేణి పరివాహక ప్రాంతమైన కొమ్ముపల్లి లింగపాలెం రెవెన్యూ పరిధిలోని మెరక భూమిని పంట సాగుకు అనుకూలంగా మారుస్తున్నామని సాకుగా చూపుతూ.. ఇస్తా రీతిలో మట్టి మాఫియా మట్టిని అక్రమంగా రవాణా చేస్తోంది.

కొమ్మపల్లి లింగపాలెం రెవెన్యూ పరిధి నుంచి బేతపల్లి రెవెన్యూ పరిధిలోనికి అక్రమ చేపడుతున్న వెంచర్ లోకి పదుల సంఖ్యల టిప్పర్లతో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. అయితే వీటిపై రెవెన్యూ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదు, మట్టి మాఫియా అధికారులకు నెలవారి మామూలు ముట్ట చెబుతున్నామని వారి వారి స్థాయిని బట్టి నెల నెల మామూలు అందజేస్తున్నామని బహిరంగంగా వ్యాఖ్యానించడం విశేషం.


ఇప్పటికైనా సింగరేణి అధికారులు, రెవెన్యూ అధికారులు చొరవ చూపి ఈ మట్టి మాఫీయా ఆగడాలను అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుకుంటున్నారు. లక్షలాది రూపాయలు వెచ్చిన రోడ్లను ఈ టిప్పర్ల మూలంగా రోడ్లన్నీ పాడవుతున్నాయని పట్టణానికి చెందిన పలువురు ఆరోపిస్తున్నారు. వీరు రవాణా చేస్తున్న మట్టి గతంలో సింగరేణి పరిహారం పొంది భూములు సింగరేణికి అప్పగించకుండా యథా స్వేచ్ఛగా మట్టిని అమ్ముకునే పనిలో పడ్డారు.


ఆ రెవెన్యూ ప్రాంతంలో రైతులు, సత్తుపల్లిలో ముగ్గురు నలుగురు యూనియన్ గా ఏర్పడి సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో మట్టి తవ్వకాలు భారీగా కొనసాగిస్తున్నారు. వీరికి జిల్లా అధికారులతో పాటు స్థానిక అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో వీరి మట్టి రవాణా మూడు పువ్వులు ఆరు కాయల్లాగా కొనసాగుతుంది. ఈ ప్రాంత ప్రజలు వీరి బారి నుండి సత్తుపల్లి ప్రాంతాన్ని కాపాడాలని కోరుకుంటున్నారు. కొమ్మపల్లి, లింగపాలెం, గ్రామాలకు చెందిన రైతులకు సింగరేణి పరిహారం అందినప్పటికీ, వారి పొలాల్లో నుంచి మట్టి ని అక్రమ అమ్ముకోవటాని, అధికారులు ఏం చర్యలు తీసుకుంటారని వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed