సెల్ ఫోన్ కు బదులు సబ్బు బిల్ల..

by Disha Web Desk 20 |
సెల్ ఫోన్ కు బదులు సబ్బు బిల్ల..
X

దిశ, కారేపల్లి : ఎంతో ఉత్సాహంతో ఆన్ లైన్ లో సెల్ ఫోన్ బుక్ చేసుకున్న ఆ యువకుడికి చివరికి నిరాశే మిగిలింది. ఆర్డర్‌ను తీసుకున్న ఆ సంస్థ పంపించిన పార్సిల్ ను తెరిచిన అతనికి 10 రూపాయల బట్టల సబ్బు దర్శనమివ్వడంతో నిర్ఘాంతపోయాడు. ఈ ఘటన సింగరేణి మండలం పేరేపల్లి లో వెలుగు చూసింది.

పేరేపల్లికి చెందిన కడిమి జగన్ మీషోయాప్ ద్వారా ఆన్ లైన్ లో ఈ నెల 12 వ తారికున నోకియా 2660 మోడల్ సెల్ ఫోను ఆర్డర్ చేశాడు. వారంరోజుల తర్వాత సోమవారం డెలివరీ బోయ్ ద్వారా పార్సిల్ రావడంతో.. రూ. 1066 చెల్లించి దానిని తీసుకున్నాడు. తీరా ఆ డబ్బాను తెరిచి చూస్తే సెల్ ఫోన్ కు బదులు 10 రూపాయల సబ్బు బిల్ల కనిపించడంతో బిత్తరపోయాడు. మోసపోయాడని తెలిసి ఖంగుతిన్నాడు. వెంటనే డెలివరీ బాయ్ ని నిలదీయటంతో డబ్బులు వాపసు చేశారు.

Next Story

Most Viewed