- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.50 వేలు మించి నగదు వెంట తీసుకెళ్లొద్దు
by velandi.Saikiran |
ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినందున ప్రజలు రూ. 50 వేలకు మించి నగదు తమ వెంట తీసుకువెళ్లరాదని స్థానిక

X
దిశ, కరకగూడెం : ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినందున ప్రజలు రూ. 50 వేలకు మించి నగదు తమ వెంట తీసుకువెళ్లరాదని స్థానిక ఎస్ఐ పి వి ఎన్ రావు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒక వ్యక్తి రూ.50 వేల నగదు మాత్రమే తీసుకెళ్లేందుకు అను మతి ఉంటుందని చెప్పారు. కావున అంతకన్నా ఎక్కువ ఉండి సరైన పత్రాలు లేకపోతే దానిని సీజ్ చేస్తామని హెచ్చరించారు.
అదే ఎక్కువగా ఉంటే ఎన్నికల అధికారులు, ఆదాయ పన్ను, జీఎస్టీ అధికారులకు సమాచారం అందించి ఆ డబ్బును కోర్టులో జమ చేస్తామన్నారు. అత్యవసర వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, పెళ్లిళ్లు వంటి ముఖ్యమైన అవసరాలకు పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లేవారు సరైన ఆధారాలు దగ్గర ఉంచుకోవాలని సూచనలు చేశారు. తనిఖీల సమయంలో అవి చూపించినట్లయితే ఆ తర్వాత వాటిని విచారించిన తరువాత విడుదల చేయటం జరుగుతుందని స్థానిక ఎస్ఐ తెలిపారు.
- Tags
- si
- elections code
Next Story






