- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థుల భద్రతపై నిర్లక్ష్యం
దిశ, కారేపల్లి రూరల్ : ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు వసతి భోజనం వి

దిశ, కారేపల్లి రూరల్ : ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు వసతి భోజనం విద్య ఏ స్థాయిలో అమలు పరుస్తారో వారి భద్రత విషయంలోనూ అదే స్థాయిలో చర్యలు చేపట్టాలి. తమ సొంత బిడ్డల్లా చూసుకోవాల్సిన బాధ్యత సంబంధిత వార్డెన్ పై ఉంటుంది. విద్యార్థుల భద్రత పై వార్డెన్ నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు సర్వత్ర వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ఉదాహరణగా ఇటీవల కారేపల్లి మండలం శాంతినగర్ బాలుర ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సాగర్ కి పరిస్థితి అనే చెపవచ్చు. పాఠశాలలో జరిగిన కబడ్డీ పోటీలలో పాల్గొని చేతికి తీవ్ర గాయం కావడంతో వైద్య నిమిత్తం ఇల్లందుకు వచ్చి రోడ్డు ప్రమాదానికి గురి కావడం వార్డెన్ నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
వైద్యశాలలో చికిత్స పొందుతున్న విద్యార్థి సాగర్ తల్లితండ్రులు భానోత్ మోతిలాల్, ఇందిరా తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల రెండు రోజుల క్రితం పాఠశాలలో విద్యార్థులకు జరిగిన కబడ్డీ పోటీలలో పాల్గొన్న సాగర్ కు చేతికి గాయం కావడంతో మరుసటి రోజు వైద్యం కోసం ఎదురుచూసి సరైన వైద్యం అందకపోవడంతో ఆదివారం వైద్యం కోసం సాగర్ తన తోటి స్నేహితులతో కలిసి ఇల్లందుకు వచ్చి వైద్యం చేయించుకొని తిరిగి హాస్టల్ కు వెళ్తున్నాడు.ఇదే సమయంలో ద్విచక్ర వాహనం లిఫ్ట్ పై వెళ్తున్న క్రమంలో ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో సాగర్ కు తలకు తీవ్ర గాయం అయింది. ఈ సమాచారం తెలుసుకున్న సాగర్ కుటుంబ సభ్యులు హుటాహుటిన మెరుగైన వైద్యం కోసం ఖమ్మం కు తరలించారు. ఈ సంఘటన జరిగిన కొద్ది గంటల వరకు హాస్టల్ పర్యవేక్షకులు అందుబాటులో లేకపోవడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు విచారణ జరిపి సాగర్ కు మంచి వైద్యం అందించాలని, నిర్లక్ష్యం వహించిన వార్డెన్, వాచ్ మెన్ పై చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సాగర్ సొంత గ్రామం రఘునాథ్ పాలెం మండలం హిర్లపూడి గ్రామపంచాయతీ పరిధిలోని దోనబండ గ్రామం.






