రేణుకా చౌద‌రిని క‌లిసిన కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు గురిజాల గోపీ

by Ratna Kumari |

దిశ, మణుగూరు: మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గురిజాల గోపి సోమవారం మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నేత రేణుకా చౌదరి ని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

రేణుకా చౌద‌రిని క‌లిసిన కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు గురిజాల గోపీ
X

దిశ, మణుగూరు: మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గురిజాల గోపి సోమవారం మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నేత రేణుకా చౌదరి ని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పినపాక నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలను ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. పినపాక నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు, కార్యకర్తల సమస్యలు, ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా సమీక్షించారు. గురిజాల గోపి పార్టీ కోసం గతంలో చేసిన సేవలను రేణుకా చౌదరి గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనంలో ఆయన పాత్ర కీలకమని పేర్కొన్నారు. భవిష్యత్ రాజకీయ ప్రణాళికలపై చర్చ జరిపారు. పినపాక నియోజకవర్గంలో పార్టీ పునాదులను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని వివరించారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపే కార్యక్రమాలపై సూచనలు చేశారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై నమ్మకం పెంచే విధంగా ముందుకు సాగాలని సూచించారు. గురిజాల గోపికి తగిన గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని రేణుకా చౌదరి అభిప్రాయపడ్డారు. ఆయనకు సముచిత స్థానం కల్పించేందుకు జాతీయస్థాయి నాయకులతో చర్చిస్తానని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రోటోకాల్ కలిగిన మంచి బాధ్యత ఇవ్వడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడే నాయకులను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని , కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు విజయాలపై ఆమె ధీమా వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా పని చేయాలని పిలుపు నిచ్చారు.

Next Story