- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఖమ్మం జోనల్ అండర్-16 క్రికెట్ జట్ల ఎంపిక

X
దిశ,ఖమ్మం : ఖమ్మం జిల్లా క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీ ఏ) ఆధ్వర్యంలో ఖమ్మం జోనల్ అండర్-16 క్రికెట్ జట్టు ఎంపిక చేస్తున్నట్లు అసోసియన్ కార్యదర్శి చేకూరి వెంకట్, సమన్వయకర్త మహమ్మద్ మసూద్ పాషా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం జోనల్ అండర్-16 బాలుర, బాలికల క్రికెట్ జట్టు ఎంపిక ఈ నెల 28 వ తేదీన పెవిలియన్ గ్రౌండ్ లో జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎంపికకు హాజరయ్యే క్రీడాకారులు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ తో ఉదయం 9 గంటలకు హాజరు కావాలని కోరారు. ఈ ఎంపికలకు ఖమ్మం జోనల్ తరఫున మొహమ్మద్ ఫారూఖ్ ఖాన్ సహకారం అందిస్తారని, జిల్లా క్రికెట్ కోచ్ వీణ, సయ్యద్ తురాబ్ అలీ ఆధ్వర్యంలో ఎంపికలు జరుగుతాయి తెలిపారు. మరిన్ని వివరాలకు 7981881095 లకు సంప్రదించాలని కోరారు.
Next Story