- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
' అక్షరాయుధంతో సమాజాన్ని మార్చిన వీర వనిత సావిత్రిబాయి ఫూలే '
ఖమ్మం నగరంలోని టీఎన్జీవోస్ జిల్లా కార్యాలయంలో సావిత్రిబాయి ఫూలే 195 జయంతి ఘనంగా నిర్వహించారు.

దిశ, ఖమ్మం : అక్షరాయుధంతో సమాజాన్ని మార్చిన వీర వనిత అని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు, జిల్లా కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కొనిదెన శ్రీనివాస్ అన్నారు. సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా శనివారం ఖమ్మం నగరంలోని టీఎన్జీవోస్ జిల్లా కార్యాలయంలో సావిత్రిబాయి ఫూలే 195 జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు గా మహిళలకు విద్యావకాశాలు కల్పించేందుకు తన జీవితాన్ని అర్పించిన మహోన్నత యోధురాలుగా నిలిచారన్నారు. మహిళా సాధికారత, సమానత్వం, విద్యా హక్కు కోసం ఆమె చూపిన దారి నేటికీ సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆమె ఆలోచనలు, విలువలు స్ఫూర్తిగా తీసుకొని, బాలికల విద్యాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సమాజంలో సమానత్వ సాధనలో టీఎన్జీవోస్ యూనియన్ ఎల్లప్పుడు ముందుంటుందని, సంఘ నాయకత్వంలో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. మహిళలు చదువుకోవటమే నేరం అనుకునే రోజులలో భర్త ప్రోత్సాహంతో తను చదువుకొని, ఆనాటి ఆడపిల్లలకు చదువు చెప్పి దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఘనతకెక్కిన సావిత్రిబాయి పూలే జయంతిని జరుపుకోవడం, ఈ సందర్భంగా వారిని స్మరించుకోవడం మనందరికీ గర్వకారణం. వారి స్ఫూర్తితో మనమందరం ముందుకు వెళ్లాలి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జెడ్.ఎస్. జైపాల్, ఉపాధ్యక్షులు ఎర్ర రమేష్, జాయింట్ సెక్రెటరీ బుస చంద్రశేఖర్, నగర అధ్యక్షులు బెజ్జంకి ప్రభాకర చారి,రఘునాథపాలెం యూనిట్ కార్యదర్శి శ్రీనివాసరావు, టీఎన్జీవోస్ ఈసీ మెంబర్ ఎన్.విజయ, హాస్టల్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు కోటపాటి రుక్మారావు, కార్యదర్శి నెల్లూరి నాగేశ్వరరావు, మెడికల్ ఫోర్ అధ్యక్షులు సైదులు, జాయింట్ సెక్రెటరీ కృష్ణ, వీరన్న, టీఎన్జీవోస్ నాయకులు ఎం.కోమలి, పి.మాధురి, బుర్రి వెంకటేశ్వర్లు, సిహెచ్.నాగమణి, బాలాజీ, ఎం.బాలు, కే.నరేందర్ రెడ్డి, ఎన్.రమేష్, తదితరులు పాల్గొన్నారు.






