కర్నూలు బస్సు ప్రమాదఘటనలో సత్తుపల్లి వాసి క్షేమం

by velandi.Saikiran |

కర్నూలు వద్ద జ‌రిగిన‌ బస్సు ప్రమాద దుర్ఘటనలో సత్తుపల్లి వాసి స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడ్డాడు.

కర్నూలు బస్సు ప్రమాదఘటనలో సత్తుపల్లి వాసి క్షేమం
X

దిశ, సత్తుపల్లి: కర్నూలు వద్ద జ‌రిగిన‌ బస్సు ప్రమాద దుర్ఘటనలో సత్తుపల్లి వాసి స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడ్డాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ పరిధిలోని ప్రకాశం పంతులు రోడ్డుకు చెందిన మన్నేపల్లి సత్యనారాయణ 28 అనే యువకుడు హైదరాబాద్ డిఆర్టిఐలో గత కొంతకాలంగా ఉద్యోగంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఇక ఆఫీస్ పని మీద గురువారం రాత్రి సత్యనారాయణ హైదరాబాదు నుంచి బెంగళూరుకు బయలుదేగాడు. అయితే, కర్నూలు వద్ద బస్సు ప్రమాదం జ‌రుగ‌గా, అందులో నుంచి స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. స్వల్ప గాయాలతో బయటపడిన సత్యనారాయణ, హైదరాబాద్‌ చేరుకున్నట్లు ఆయన తండ్రి తెలిపారు.

Next Story