త్వరలో100 పడకల ఆసుపత్రి ప్రారంభిస్తాం

by velandi.Saikiran |

సత్తుపల్లి పట్టణం లో నూతన గా నిర్మించిన 100 పడకల ప్రభుత్వాసుపత్రిని త్వరలో ప్రారంభిస్తామని MLA మట్టా రాగమయి

త్వరలో100 పడకల ఆసుపత్రి  ప్రారంభిస్తాం
X

దిశ,సత్తుపల్లి: సత్తుపల్లి పట్టణం లో నూతన గా నిర్మించిన 100 పడకల ప్రభుత్వాసుపత్రిని త్వరలో ప్రారంభిస్తామని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు, ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో ఉండి రాష్ట్రస్థాయిలో పదవి అనుభవిస్తూ ఇటివల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థులను రంగంలో దించి రూ 40 కోట్ల రూపాయల డబ్బు కేటాయించి వారి గెలుపున‌కు సహకరించిన వారి పై ఆధారాలతో సీఎం కి ఫిర్యాదు చేస్తామని అన్నారు.

మాజీ ఎమ్మెల్యే సండ్ర గత 15 ఏళ్ల పాలనలో నియోజకవర్గంలో సొంత ఇల్లు నిర్మించుకోలేకపోయారని పేర్కొన్నారు. అలాంటి వ్య‌క్తి అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమ‌ర్శ‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్టీకి ద్రోహం చేసే ఎవరిని వదిలిపెట్టమని రాబోయే రోజుల్లో వారికి తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ దయానంద విజయ్ కుమార్, ఏఎంసీ చైర్మన్లు దోమ ఆనంద్ బాబు, భాగం నీరాజాదేవి, మండల అధ్యక్షులు శివ వేణు, పట్టణ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, సీనియర్ నాయకులు చల్లగుల్ల నరసింహారావు, కృష్ణయ్య ,పసుమర్తి చందర్రావు,ఎండి కమల పాషా, పింగళి సామేలు, పలువురు సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story