- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మట్టి దొంగలు.. అధికారులు లారీ మాఫియా కుమ్మక్కు?
ఒకప్పుడు మట్టిని నమ్ముకునేవారు. ఇప్పుడు మట్టిని అమ్ముకుంటున్నారు.

దిశ, పాల్వంచ రూరల్ : పాల్వంచ ప్రాంతంలో సీతారామ ప్రాజెక్ట్ మట్టిని యథేచ్చగా తరలిస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు పాల్వంచకు చెందిన లారీ యజమానులు కుమ్మక్కై వేల సంఖ్యలో లారీల మట్టిని గుట్టుగా తరలిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు ఇచ్చే అనుమతులు గోరంత ఉంటే, ఈ అనుమతులను అడ్డం పెట్టుకుని వందల కొద్దీ లారీల మట్టి రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల పాల్వంచ మండల పరిధిలోని సోములగూడెం వద్ద ఫారెస్ట్ అధికారులు మట్టి లారీలను ఆపి పరిశీలించగా, మూడు లారీల్లో ఒక్క లారీకి మాత్రమే చెల్లుబాటు అయ్యే అనుమతులు ఉండగా, మిగిలిన రెండు లారీలకు ఎలాంటి అనుమతులు లేవని తేలింది. కానీ ఫారెస్ట్ అధికారులు ఆ లారీలను సీజ్ చేయకుండా అనుమతి లెటర్ వచ్చాక చూసి పంపుతామని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. ఇరిగేషన్, ఫారెస్ట్ శాఖల మధ్య సమన్వయం ఉండటంతోనే ఈ అక్రమ రవాణాకు మార్గం సుగమం చేస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రాంతంలో సీతారామ ప్రాజెక్ట్ మట్టిని అక్రమంగా తరలిస్తున్న వ్యవహారం కలకలం రేపుతోంది. ఇరిగేషన్ అధికారులు పాల్వంచకు చెందిన లారీ యజమానులు కుమ్మక్కై వేల సంఖ్యలో లారీల మట్టిని తరలిస్తున్నారనే ఆరోపణలు స్థానికుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఇరిగేషన్ శాఖ అధికారులు ఇచ్చే అనుమతులు గోరంత మాత్రమే ఉంటే, వాస్తవంగా జరుగుతున్న మట్టి తరలింపు మాత్రం కొండంతగా ఉందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమతుల పేరుతో కొద్ది లారీలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, ఆ అనుమతులను అడ్డం పెట్టుకుని వందల లారీలను నిర్బంధం లేకుండా నడుపుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
పాల్వంచ మండల పరిధిలోని సోములగూడెం వద్ద గత బుధవారం ఫారెస్ట్ అధికారులు మట్టి లారీలను ఆపి పరిశీలించగా, మూడు లారీల్లో ఒక్క లారీకి మాత్రమే చెల్లుబాటు అయ్యే అనుమతులు ఉండగా, మిగిలిన రెండు లారీలకు ఎలాంటి అనుమతులు లేవని తేలింది. దీంతో ఫారెస్ట్ అధికారులు ఆ రెండు లారీలను తమ అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఇక్కడే అసలు కథ మలుపు తిరిగింది. లారీ యజమానులు వెంటనే ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేయడంతో, అనుమతి లెటర్ పంపిస్తాం అంటూ హామీ ఇవ్వడం వెనుక అధికార–లారీ యజమానుల మధ్య జరుగుతున్న లావాదేవీలు ఇట్టే అర్థమవుతున్నాయని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు లారీలను సీజ్ చేయకుండా లెటర్ వచ్చాక చూసి పంపుతాం అని చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఇరిగేషన్, ఫారెస్ట్ శాఖల మధ్య సమన్వయం పేరుతో అక్రమాలకు అడ్డుగోడగా నిలవాల్సిన వ్యవస్థే, అక్రమ రవాణాకు మార్గం సుగమం చేస్తోందన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి, అనుమతుల జారీ నుంచి మట్టి తరలింపు వరకు సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే సీతారామ ప్రాజెక్ట్ మట్టి అక్రమ రవాణా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అడ్డుకట్ట లేకుండా కొనసాగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
పట్టుకున్న మట్టి లారీలకు ఎలాంటి అనుమతులు వారి వద్ద లేకపోవడంతో లారీలను మా ఆధీనంలో ఉంచాం. సీతారామ ప్రాజెక్టు ఏఈ ఫోన్ చేసి పట్టుకున్న లారీలకు అనుమతులు ఉన్నాయని, అనుమతి పత్రాలను పంపిస్తామని చెప్పారు. ఆ అనుమతి పత్రాలు వచ్చాక పరిశీలించి, చర్యలు తీసుకుంటాం. - ఫారెస్ట్ రేంజ్ అధికారి సురేశ్






