- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ ఇండ్లపేరుతో ఇసుక రవాణా
తిరుమలాయపాలెం మండల పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దిశ, తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం మండల పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక తరలింపుపై ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా తుంగలో తొక్కుతూ.. అక్రమ ఇసుక రవాణా సాగిస్తున్నారు. దాడులు చేసి, చర్యలు తీసుకోవాలిసిన సంబంధిత అధికారులు పట్టనట్టు చోద్యం చూస్తూ ఆఫీసులకే పరిమితమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో అక్రమ ఇసుక వ్యాపారుల జోరుకు మండలంలో అడ్డు అదుపులేకుండా పోతోంది.
ఇసుక డంపులు..
ముజాహిద్‌పురం గ్రామ సమీపంలోని పాలేరు వాగు నుంచి, అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తోడేస్తున్నారు. ఈ ఇసుకను ముజాహిద్‌పురంతో పాటు, సమీప గ్రామమైన కాకరవాయిలో రహదారుల వెంబడి, అనువైన ప్రదర్శల్లో ఇసుకు డంపులు చేసి, బాహాటంగానే రూ.లక్షల రూపాయల అక్రమ ఇసుక వ్యాపారం సాగిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో అక్రమార్కులు చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు250 ట్రాక్టర్ ట్రిప్పుల వరకు ఇసుక రాశులు పోసి, అధికారులకు సవాళ్లు విసురుతున్నారు. ఇదేంటని ఇసుక అక్రమార్కులపై ప్రశ్నించేందుకు ఎవరూ సాహసం చేయడం లేదు.
ఇందిరమ్మ ఇండ్లపేరిట..
ఒక్కోక ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం, 10-12ట్రక్కుల ఇసుక అవసరం పడుతుంది. దీనికి రెవెన్యూ శాఖనుంచి టోకెన్ (అనుమతులు) తప్పనిసరిగా తీసుకోవాలి. ఒక్కో కూపన్ అనుమతితో ఒక ట్రాక్టర్ ట్రక్కు ఇసుక మాత్రమే తరలించాలనే ఆదేశాలు ఉన్నాయి. కానీ అక్రమార్కులు మాత్రం, ఒక కూపన్ అనుమతి పొంది, మూడు నుంచి ఐదు ట్రక్కుల ఇసుక లోడ్లు అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ తతంగం అంతా, పట్టపగలే ప్రధాన రహదారులపై జరుగుతుండటం విశేషం.
కూపన్లు తీసుకునే ఇసుక తరలించాలి
లూథర్ విల్సన్, తహసీల్దార్
ఇసుక అక్రమంగా డంపు చేసిన విషయం తమ దృష్టికి రాలేదు. ముజాహిద్‌పురం, కాకరవాయి గ్రామాల్లో పర్యవేక్షిస్తాం. ఇసుక డంపులు గుర్తించి, సీజ్ చేసి, చర్యలు తీసుకుంటాం. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమయ్యే ఇసుకను కూపన్ల ద్వారానే తరలించాలి. ఎవరైనా అతిక్రమిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం.






