లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు... క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్

by velandi.Saikiran |

ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం గురువారం

లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు... క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్
X

దిశ, ఖమ్మం రూరల్: ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం గురువారం వర్షం పడిన తరుణంలో మద్దులపల్లి గ్రామంలో ఖమ్మం - సూర్యాపేట ప్రధాన రహదారి పక్కన లారీలు ఆపారు. ఈ తరుణంలోనే సూర్యాపేట వైపు నుంచి వస్తున్న సూర్యాపేట డిపో బస్సు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆర్టీసీ డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కున్నారు. కాగా బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు... క్రేన్ సాయంతో క్యాబిన్ లో ఇరుక్కున్న బస్సు డ్రైవర్ ను తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. బస్ డ్రైవర్ కాళ్లు వీరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story