- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ. 5కోట్ల ప్రభుత్వ భూమి పై కన్ను
దిశ, సత్తుపల్లి/ పెనుబల్లి : ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన రెవెన్యూ అధికారుల నిర్వాహకం వల్ల 3.20 గుంటల భూమిలో

దిశ, సత్తుపల్లి/ పెనుబల్లి : ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన రెవెన్యూ అధికారుల నిర్వాహకం వల్ల 3.20 గుంటల భూమిలో 1.20 గుంటల భూమికి డిజిటల్ సైన్ పూర్తి చేసి పాస్ బుక్ కు ఎదురుచూస్తున్న తరుణంలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. పెనుబల్లి మండలం చింతగూడెం గ్రామం రెవెన్యూ పరిధిలోని లీలావతి మహిళ నుంచి 71/3, 71/4, సర్వే నెంబర్లలో 3.20. ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే ప్రభుత్వ భూమి అని 2022 ఆగస్టు నెలలో గురించి అప్పటి కలెక్టర్ సరిహద్దులు నిర్ధారించారు. ప్రభుత్వ భూమి అని సూచిక బోర్డులు ఏర్పాటు చేయగా ఇటీవల చింతగూడెం రెవెన్యూ పరిధిలోని సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవే, ఖమ్మం టు దేవరపల్లి, విజయవాడ టు భద్రాచలం, నేషనల్ హైవే ఆనుకొని ఉండటంతో సుమారు ఐదున్నర కోట్ల రూపాయల విలువచేసే భూమిపై కొందరు అక్రమార్కులు కన్నేశారు. ఇటీవల భూ భారతి లో అప్లికేషన్ చేయగా ఇటీవల 3.20. ఎకరాల భూమిలో నుంచి 1.20. ఎకరాల భూమి శీలం లీలావతి భర్త రామచందర్ రెడ్డి పేరు మీద తహశీల్దార్ నుంచి డిజిటల్ సైన్ పూర్తిచేసుకుని పట్టాదారు పాస్ పుస్తకం కోసం హైదరాబాద్ సర్వర్ కు పంపించారు. దీనిపై అనుమానం వచ్చిన చింతగూడెం గ్రామస్తులు రికార్డులను పరిశీలించగా పెనుబల్లి తహశీల్దార్, రెవిన్యూ ఉద్యోగుల నిర్వాహకం బట్టబయలైంది.
లక్షల రూపాయలు చేతులు మారినట్టు ప్రచారం
పెనుబల్లి మండలం చింతగూడెం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 71/3, 71/4 గల 3.20. ఎకరాల భూమిని సీలింగ్ భూమిని రిజిస్ట్రేషన్ మార్చి శీలం లీలావతి పేరిట రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయటంపై పెనుబల్లి తహశీల్దార్ శ్రీనివాస్ యాదవ్,రెవెన్యూ ఉద్యోగులకు భారీ స్థాయిలో ముడుపులు ముట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ముందస్తు ఒప్పందం మేరకు కొంత నగదు రెవెన్యూ ఉద్యోగులకు అందిందని.. ఆ తరువాత పాస్ పుస్తకం అందిన వెంటనే మిగతా నగదు చెల్లించేవిధంగా ఒప్పందం జరిగినట్లు సమాచారం. సాధారణంగా రిజిస్ట్రేషన్ గ్రామ రెవెన్యూ అధికారి వీఏవో విచారణ తరువాత ఆర్ఐ పంచనామా చేయాలి. అక్కడి నుంచి సూపరింటెండెంట్ తర్వాత డిప్యూటీ తహశీల్దార్, చివరకు తహశీల్దార్ డిజిటల్ సంతకం ఉంటుంది. కానీ ఇలాంటివి ఏమీ జరగకుండా తహశీల్దార్ డిజిటల్ సైన్ చేసినట్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
తప్పు సరిదిద్దేందుకు తహశీల్దార్ ప్రయత్నం
చింతగూడెం సర్వే నెంబర్ 71/3, 71/4, 3.20 భూమిలో 1.20 ఎకరాల భూమి ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు పొరపాటున డిజిటల్ సైన్ పూర్తి చేశామని తిరిగి రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తున్నట్టు తహశీల్దార్ మీడియా మిత్రులకు తెలిపారు.
తహశీల్దార్ పై సబ్ కలెక్టర్, కలెక్టర్ కు ఫిర్యాదు
పెనుబల్లి తహశీల్దార్ రెవెన్యూ ఉద్యోగుల నిర్వహకం పై కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ కుమార్ యాదవ్ కు కలెక్టర్ అనుదీప్ దరిశెట్టికి పెనుబల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు పంది వెంకటేశ్వర్లు, పలువురు కాంగ్రెస్ నాయకులు చింతగూడెం గ్రామస్తులు కలెక్టర్ కి ఫిర్యాదు చేసారు. వెంటనే తహశీల్దార్ నుంచి తొలగించాలని చర్యలు తీసుకోవాలని కోరారు.






