రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత : ఎస్సై ఎన్. వెంకటకృష్ణ

by Batti.Sumithra |

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తల్లాడ ఎస్సై ఎన్.వెంకటకృష్ణ అన్నారు.

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత : ఎస్సై ఎన్. వెంకటకృష్ణ
X

దిశ, తల్లాడ : రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తల్లాడ ఎస్సై ఎన్.వెంకటకృష్ణ అన్నారు. రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా సత్తుపల్లి ఏసీపీ వసుంధర యాదవ్ ఆదేశాల మేరకు ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి హెచ్‌పీ పెట్రోల్ బంక్ వరకు 50 మంది హెల్మెట్ ధరించి మోటార్ సైకిళ్లపై ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండలంలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపడతామని తెలిపారు. నిత్యం హైవేలపై వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహించి ప్రమాదాలను నివారించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ ర్యాలీలో స్టేషన్ రెండవ ఎస్సై వెంకటేష్, పోలీసు సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు జక్కంపూడి కిషోర్, కర్నాటి లక్ష్మారెడ్డి, ఎర్రి నరసింహారావు, జక్కంపూడి నాగేశ్వరరావు, వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story