దమ్మపేటలో రోడ్డు ప్రమాదం.. మూడు వేల బాతులు మృతి

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-03-21 07:14:32  IST  )

ద‌మ్మపేట‌ మండల పరిధిలోని ముష్టిబండ- మొద్దులగూడెం గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో దాదాపు మూడు వేల బాతులు మృత్యువాతప‌డ్డాయి.

దమ్మపేటలో రోడ్డు ప్రమాదం.. మూడు వేల బాతులు మృతి
X

దిశ, దమ్మపేట : మండల పరిధిలోని ముష్టిబండ- మొద్దులగూడెం గ్రామాల మధ్య శుక్ర‌వారం అర్థ‌రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని వెనుక నుంచి లారీ బలంగా ఢీ కొట్ట‌డంతో దాదాపు 3,000 బాతులు మృత్యువాత పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాడువాయి గ్రామం నుంచి తిరువూరుకు నాలుగు వేల బాతులతో వెళ్తున్న బొలెరో వాహనం, ముష్టిబండ సమీపంలోని ధాబా వద్ద రోడ్డు పక్కన నిలిపారు. ఇక‌ అదే సమయంలో మొక్కజొన్న లోడుతో వస్తున్న లారీ అదుపుతప్పి ఆగి ఉన్న బొలెరో వాహ‌నాన్ని వెనుక వైపు నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాద ధాటికి రెండు వాహనాలు రోడ్డు పక్కకు దూసుకెళ్లాయి. ఈ ప్రమాదంలో బొలెరోలో తరలిస్తున్న 4,000 బాతుల్లో సుమారు 3,000 బాతులు మృతి చెందాయి. లారీలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి కి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న దమ్మపేట పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం అశ్వరావుపేట ఆసుపత్రికి తరలించారు. అనంతరం జేసీబీ సహాయంతో రోడ్డు పక్కన పడిపోయిన బొలెరో వాహనాన్ని, లారీని బయటకు తీయించి ట్రాఫిక్ పునరుద్ధరించారు.

Next Story