- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భక్తులకు కనువిందు చేసేలా రివర్ ఫెస్టివల్
ఈ నెల 29, 30 తేదీలలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారిదేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే తెప్పోత్సవం, వైకుంఠ

దిశ, భద్రాచలం: ఈ నెల 29, 30 తేదీలలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారిదేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే తెప్పోత్సవం, వైకుంఠ ద్వార దర్శనంనకు సంబంధించిన అన్ని ఏర్పాట్ల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడించారు. అలాగే గోదావరి రివర్ ఫెస్టివల్ కు సంబంధించిన ఏర్పాట్లు గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం పెద్ద ఎత్తున చేపడుతున్నామని అన్నారు. ఆదివారం భద్రాచలంలోని ఏరు ఫెస్టివల్, గోదావరి కరకట్టల పక్కన కల్చరల్ ప్రోగ్రామ్ కు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
ఈ నెల 22వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రతిరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న దర్శనీయ స్థలాలను పర్యాటకులు దర్శించుకునేలా ప్రణాళికల రూపొందిస్తున్నామని వివరించారు. కనివిని ఎరుగని రీతిలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున పర్యాటకులు, భక్తులు వచ్చి తనివి తీరా తిలకించి విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ డి ఈ వెంకటేశ్వర్, ఏఈ వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ రాము, డి ఈ రవితేజ, దేవస్థానం డి రవీందర్, ఏపీఎం త్రిగుణ, జగదీశ్వర్, జిపిఈఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






