ప్లాంట్ పునరుద్దరణకు చర్యలు చేపడతా - రేణుకా చౌదరి

by velandi.Saikiran |

పాల్వంచలోని ఖాయిలాపడ్డ యన్. యమ్. డీ. సి ప్లాంట్ ను పునరుద్దరించుటకు మేనజ్మెంట్ ను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని

ప్లాంట్ పునరుద్దరణకు చర్యలు చేపడతా - రేణుకా చౌదరి
X

దిశ,పాల్వంచ టౌన్: పాల్వంచలోని ఖాయిలాపడ్డ యన్. యమ్. డీ. సి ప్లాంట్ ను పునరుద్దరించుటకు మేనజ్మెంట్ ను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టి చర్చలు జరుపుతానని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి హామీ ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్ ఆమే నివాసంలో పీ. సీ. సీ నాయకులు షేక్ అబ్దుల్ జలీల్, కాంగ్రేస్ పార్టీ సీనియర్ నాయకులు బాణోత్ బాలు నాయక్ లు కలసి వినతిపత్రం అందచేసి సుదీర్ఘంగా మాట్లాడారు. ప్లాంట్ పరిస్ధితిని పార్టీ నాయకులు వివరించగా.. ఈ అంశంపై స్పందించిన రేణుకా చౌదరి మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ ను అభివృద్ది చేయని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపించే విధంగా స్వయంగా నేనే చర్యలు చేపడతానని చెప్పారు. అటు కేంద్రంతోని, ఇటు రాష్ట్ర తోని తాడోపేడో తేల్చుకుంటానని హామీ ఇచ్చారు. ప్లాంట్ నడుపుటకు తెలంగాణాలో ఎలక్షన్ కోడ్ వున్నందున ఎలక్షన్స్ పూర్తి అయిన తర్వాత చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఒకప్పటి పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచను మరలా పారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్దుటకు తన వంతు క్రుషి చేస్తానని నాయకులకు హామి ఇచ్చారు. ముందుగా ఆమేకు పుష్ప గుచ్చం అందించి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో వారితో పాటు వీరన్న పాల్గొన్నారు.

Next Story