రజకులు అన్ని రంగాల్లో రాణించాలి : మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ సంగం వెంకట పుల్లయ్య.

by Ratna Kumari |

దిశ, మణుగూరు : రజకులు అన్ని రంగాల్లో రాణించాలని, ఐక్యంగా ముందుకు సాగాలని భద్రాచలం మోటార్

రజకులు అన్ని రంగాల్లో రాణించాలి : మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ సంగం వెంకట పుల్లయ్య.
X

దిశ, మణుగూరు : రజకులు అన్ని రంగాల్లో రాణించాలని, ఐక్యంగా ముందుకు సాగాలని భద్రాచలం మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ సంగం వెంకట పుల్లయ్య అన్నారు. ఆదివారం తుక్కుగూడెం సమ్మక్క,సారక్క ఆలయం వద్ద మణుగూరు మండల రజక కుటుంబాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం(వన భోజనాలు) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతీ ఏడాది ఒకసారి రజకులు అంతా ఒకచోట చేరి కష్ట,సుఖాలను పంచుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ వన భోజన కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల నుండి సుమారు పన్నెండు వందల మంది రజకులు హాజరయ్యారు. ముందుగా పీ వీ కాలనీ క్రాస్ రోడ్ వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో చిటికెన భాస్కర్, పున్నం భిక్షపతి, వల్లంకొండ అప్పయ్య, పున్నం ఉమామహేశ్వరరావు, ముజాకర్, పొనగంటి కృష్ణ,రాపర్తి శ్రీ హరి, అక్కినేపల్లి సత్యనారాయణ, సట్టు యాకయ్య, పొన్నా కనకయ్య, కుమ్మరికుంట్ల సుధాకర్, రామ్మూర్తి, ఖంభంపాటి శ్రీనివాసరావు, చామంచుల శ్రీను, ఘంటసాల శ్రీను, నిమ్మల భాస్కర్, గంగాధర్, యాదగిరి, కుమ్మరికుంట్ల వెంకట సోములు తదితరులు పాల్గొన్నారు.

మండల కమిటీ ఎన్నిక

రజక సంఘం మణుగూరు మండల అధ్యక్షులుగా పున్నం ఉమామహేశ్వరరావు, కార్యదర్శిగా తనకం ముజాకర్, కోశాధికారిగా వల్లంకొండ అప్పయ్య,ఉపాధ్యక్షులుగా కుమ్మరికుంట్ల సుధాకర్ లతో పాటు ఇస్త్రీ షాపుల మండల కమిటీ అధ్యక్షులుగా ఘంటసాల శ్రీను, కార్యదర్శిగా ఆరెల్లి సంపత్, కోశాధికారిగా వరిపెళ్లి మల్లయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Next Story