- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతు కులాన్ని నమోదు చేయడం అనాగరిక చర్య.. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన
ఎరువులు విక్రయ కేంద్రంలో రైతు కులం నమోదు అనాగరిక చర్య అని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు.

దిశ, వైరా: ఎరువులు విక్రయ కేంద్రంలో రైతు కులం నమోదు అనాగరిక చర్య అని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వ రసాయన ఎరువులు మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 21 న ఎరువులు విక్రయ కేంద్రంలో రైతులు కులం నాలుగు కేటగిరీలో నమోదు చేయాలని నోటిఫికేషన్ విడుదల చేయడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం వైరా లో నిరసన వ్యక్తం చేసి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే సబ్సిడీ లు కుదించడం కోసం కులం విభజన రైతుల్లో తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుందన్నారు.
రైతులు గిట్టుబాటు ధర, మద్దతు ధరలుకు చట్టబద్ధత, దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ డిమాండ్ చేస్తూ ఉద్యమాలు చేస్తుంటే వాటి గురించి ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఎరువులుకు ఆధార్ కార్డు అనుసంధానం, కుల నమోదు, నగదు బదిలీ ఆలోచన చేస్తూ రైతులను, వాస్తవ సాగు దారులను వ్యవసాయానికి దూరం చేసే చర్యల్లో భాగంగా వేగవంతం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కుల నమోదు నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, రైతు సంఘం జిల్లా నాయకులు తోట నాగేశ్వరరావు, సిఐటియు జిల్లా నాయకులు సుంకర సుధాకర్, గోపవరం సోసైటి డెరైక్టర్ సంక్రాంతి నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.






