- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పట్టువదలని విక్రమార్కులు
దిశ, చర్ల : పట్టు వదలని విక్రమార్కుడి వలే చీమలమర్రి మురళి కృష్ణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జయకేతనం ఎగుర వేశాడు. న

దిశ, చర్ల : పట్టు వదలని విక్రమార్కుడి వలే చీమలమర్రి మురళి కృష్ణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జయకేతనం ఎగుర వేశాడు. నలు దిక్కులు పిక్కటిల్లేలా అటు ఇర్ప వసంత్, ఇటు పోలిన లంక రాజు,పోట్రూ బ్రహ్మానందరెడ్డితో కూడిన సైన్యం 10మంది సర్పంచ్ లను గెలిపించుకున్నారు.ఆది నుండి విజయమే లక్ష్యంగా సాగిన వీరి ప్రచారానికి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు.పేదల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న చీమలమర్రి మురళి కృష్ణ గోదావరి పరివాహక ప్రాంతంలో తన మార్క్ రాజకీయం చేశారు.ఆయనకు కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు ఇర్ప వసంత్, సీనియర్ నాయకులు పోట్రూ బ్రహ్మానందరెడ్డి,పోలిన లంక రాజు తోడు అవ్వడంతో పది స్థానాల్లో గెలుపు నల్లేరుపై నడకగ సాగింది!మొదటి నుండి పేదలకు దగ్గరగా ఉండే వీరు.స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోమారు తమ సత్త చాటుకున్నారు.మండలంలో ఏ నాయకుడికి లేని పేరు ప్రతిష్టలను అనాది కాలంలోనే కూడగట్టుకున్నారు.వీరి జన బలం ముందు ప్రత్యర్థుల ఎత్తుగడలు నిలవలేదనే చెప్పాలి.ముఖ్యంగా చీమలమర్రి మురళి కృష్ణ మాటిస్తే ఆ మాటకు కట్టుబడి ఉండే వ్యక్తిగా మండలంలో మంచి పేరుంది.అదే పేరు మరోమారు మరింతగా ఆదరణ పొందిందనే చెప్పాలి! సీనియర్ నేత పోలిన లంక రాజు సైతం తనదైన శైలిలో పేదలకు అండగా నిలిచి అపారమైన ప్రజా అభిమానాన్ని సంపాదించుకున్నారు.ముక్కుసూటి నేతగా పేరు సంపాదించుకున్నారు.మరో వైపు పోట్రూ బ్రహ్మానందరెడ్డిది సైతం ప్రజా ఆదరణ నేతగా చెప్పాలి.
ఎమ్మెల్యే కలసిన నూతన సర్పంచ్ లు
చీమలమర్రి మురళి కృష్ణ,పోలిన లంక రాజు, పోట్రూ బ్రహ్మానందరెడ్డి,యువ నేత ఇర్ప వసంత్ నాయకత్వంలో గెలిచిన 10 మంది సర్పంచులు ఉప సర్పంచ్ లు మంగళవారం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును మర్యాదపూర్వకంగా కలిశారు.నూతనంగా గెలుపొందిన సర్పంచ్ లను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించారు.ప్రజల మెచ్చిన పరిపాలనను అందించాలని సూచించారు.ఎమ్మెల్యేను కలిసిన వారిలో సుబ్బంపేట సర్పంచ్ కాకా సత్యనారాయణ,సి, కత్తిగూడెం సర్పంచ్ ఇర్ప ఉమా,మొగలపల్లి సర్పంచ్ కుప్పా సత్యవతి,గొమ్ముగూడెం సర్పంచ్ కనితి రమాదేవి,సత్యనారాయణపురం సర్పంచ్ చిక్కాల గౌతమి,కలివేరు సర్పంచ్ తెల్లం లక్ష్మణరావు,దేవరపల్లి సర్పంచ్ తెల్లం సుజాత,బోదినెల్లి సర్పంచ్ వజ్జం సింగయ్య ,పెద్దపల్లి సర్పంచ్ కనితి రామకృష్ణ ,కేసాపురం సర్పంచ్ కాపుల శారద తదితరులు ఉన్నారు.






