- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమతులు ఒకలా.. నిర్మాణాలు మరోలా..! పట్టించుకోని టౌన్ ప్లానింగ్ అధికారులు
ఖమ్మం నగరంలో బహుళ అంతస్తుల అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అనుమతులు పొంది నిబంధనలకు విరుద్ధంగా సెట్ బ్యాక్ వదలకుండా, రహదారులను ఆక్రమిస్తూ బిల్డర్లు రెచ్చిపోతున్నారు.

ఖమ్మం నగరం నడిబొడ్డు ఇష్టారాజ్యంగా బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. అక్రమార్కులు నిర్మాణ అనుమతి విషయంలో తెలివిగా ప్రవర్తిస్తున్నారు. అన్ని ధ్రువపత్రాలు ఇచ్చి నిర్మాణ అనుమతులు పొందుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. భవనాలు నిర్మించే క్రమంలో కొందరు రహదారులను ఆక్రమించడం, సెట్ బ్యాక్‌కు స్థలం వదలడం లేదు. నిబంధనలు పాటించని బహుళ అంతస్తుల నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తే కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని, తర్వాత అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వస్తున్నాయి. దీంతో నిర్మాణదారులు నిబంధనలు పట్టించుకోకుండా పనులు కొనసాగిస్తున్నారు.
దిశ, ఖమ్మం కార్పొరేషన్: ఖమ్మం నగరం ఎంత అభివృద్ధి చెందుతున్నదో అంతకుమించి అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాకుండా నగరం నడిబొడ్డునే అక్రమ నిర్మాణాలు చేపట్టడం గమనార్హం. ఖమ్మం నగరంలో ఇటీవల వందలాది బహుళ అంతస్తుల నిర్మాణాలను ప్రారంభించారు. అయితే చాలామంది నిర్మాణదారులు నిబంధనలను తుంగలో తొక్కి నిర్మాణాలు చేపడుతున్నారు. రహదారులు ఆక్రమించడం సెట్ బ్యాక్ లేకుండా నిర్మాణాలు చేయడం చేస్తున్నారు. మున్సిపల్ చట్టం ప్రకారం కనీస స్థలాన్ని సైతం వదలడం లేదు. మొత్తం స్థలంలో నిర్మాణం చేపట్టి అక్రమాలకు పాల్పడుతున్నారు.
అనుమతులు తీసుకొని... ఇష్టారీతిగా నిర్మిస్తూ..
అక్రమార్కులు నిర్మాణ అనుమతి విషయంలో తెలివిగా ప్రవర్తిస్తున్నారు. అన్ని ధ్రువపత్రాలు ఇచ్చి నిర్మాణ అనుమతులు పొందుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారు. రహదారులను ఆక్రమించడం, సెట్ బ్యాక్‌కు స్థలం వదలకపోతే పోవడం జరుగుతుంది. నిర్మాణం చుట్టూ స్థలం లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరిగినా భారీ నష్టం వాటిల్లే ప్రమాదం నెలకొంది.
నిబంధనలకు విరుద్ధంగా...
ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాల్లో నిబంధనలకు వ్యతిరేకంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు. నగరంలోని వైరా రోడ్డు, ఖమ్మం బైపాస్ రోడ్, నెహ్రునగర్ ప్రాంతంలో ఇబ్బడి ముబ్బడిగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ముఖ్యంగా నెహ్రూ నగర్‌లో చేపడుతున్న బహుళ అంతస్తు నిర్మాణం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.
నోటీసులతో సరి..
నిబంధనలు పాటించని బహుళ అంతస్తులు నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తే కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు జరుపుకుంటున్నారు. తర్వాత అటువైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో నిర్మాణదారులు పట్టించుకోకుండా తమ నిర్మాణాలను కొనసాగిస్తున్నారు. ఎవరు తమను ఏమి చేయలేరనే ధీమాతో నిర్మాణాలను చేపడుతున్నారు.
విజిలెన్స్ కమిటీ ఊసేది?
గతంలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు అధికారులతో కూడిన విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో అక్రమార్కులు జాగ్రత్తగా నిర్మాణాలు నిబంధనలతో చేసేవారు. ప్రస్తుతం విజిలెన్స్ కమిటీ ఊసు లేకపోవడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. జిల్లా కలెక్టర్ అక్రమ నిర్మాణాల విషయంలో ప్రత్యేక దృష్టిసారించి విజిలెన్స్ కమిటీ పునరుద్ధరిస్తే అక్రమ నిర్మాణాలు అరికట్టే వీలుంటుంది.






